AP Politics: జగన్‌కు షర్మిల మరో బిగ్ షాక్..
ABN, Publish Date - Jul 08 , 2024 | 10:19 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైస్.రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ కుమార్తె, పీసీసీ చీఫ్ షర్మిల జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. ఇడుపులపాయ వైఎస్సార్ సమాధి వద్ద ఏకకాలంలో నివాళులర్పించాలని ప్లాన్ చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైస్.రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ కుమార్తె, పీసీసీ చీఫ్ షర్మిల జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. ఇడుపులపాయ వైఎస్సార్ (YSR) సమాధి వద్ద ఏకకాలంలో నివాళులర్పించాలని ప్లాన్ చేశారు. అయితే షర్మిల ఆ ప్రతిపాదనకు నో చెప్పినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా జగన్, షర్మిల మధ్య విబేధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయ్యాయి. ఓవైపు వైసీపీ, మరోవైపు షర్మిల (Sharmila) నేతృత్వంలో కాంగ్రెస్ సైతం ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశాయి. దీంతో కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు సద్దుమణుగుతాయని అంతా ఆశించారు. విజయమ్మ ద్వారా షర్మిలతో కాంపర్‌మైజ్ అయ్యేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేశారనే ప్రచారం జరిగింది. ఈక్రమంలో వైఎస్సార్ జయంతి సందర్భంగా అన్నా, చెల్లెలు కలుస్తారనే చర్చ నడిచింది. అయితే జగన్, షర్మిల వేర్వేరుగా నివాళులర్పించారు. ఇద్దరి వెంట వైఎస్.విజయమ్మ ఉన్నారు.
Samineni Udayabhanu: ఇంత ఘోర ఓటమెలా.. నిద్ర పట్టడం లేదు!
తొలుత జగన్..
ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు ముందుగా విజయమ్మ చేరుకున్నారు. ఆ తర్వాత జగన్ చేరుకుని నివాళులర్పించారు. జగన్‌తో పాటు వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
TDP: చంద్రబాబు సీఎం కావాలని మొక్కుకున్నాం: దేవేంద్ర
జగన్ వెళ్లాక..
తన తండ్రికి నివాళులర్పించి జగన్ వెళ్లిపోయిన తర్వాత వైఎస్.షర్మిల అక్కడకు చేరుకున్నారు. తల్లి విజయమ్మతో కలిసి ఆమె నివాళులర్పించారు. షర్మిలతో పాటు బ్రదర్ అనీల్, కుమార్తు, కుమారుడు, కోడలు ఉన్నారు. తండ్రికి నివాళులర్పించిన తర్వాత షర్మిల విజయవాడకు బయలుదేరారు.
Free Sand Scheme : ఇక ఇసుక ఉచితం
విజయవాడలో భారీ కార్యక్రమం..
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు ఈకార్యక్రమానికి హాజరుకానున్నారు. మరోవైపు వైసీపీ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. షర్మిల పీసీసీ చీఫ్‌గా ఉండటంతో కాంగ్రెస్ బారీ స్థాయిలో ఈకార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. ఓవైపు వైసీపీ ఏపీలో బలహీపడుతుండటంతో.. ఆ పార్టీ క్యాడర్‌ను ఆకర్షించేపనిలో కాంగ్రెస్ పడినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా వైఎస్సార్ సానుభూతిపరులు, అభిమానులు తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తే భవిష్యత్తులో ఏపీలో పార్టీ పుంజుకునే అవకాశాలుంటాయని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Jul 08 , 2024 | 10:19 AM