ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kesineni Chinni: మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అనంతరం కేశినేని చిన్ని కీలక ప్రకటన

ABN, Publish Date - Jun 10 , 2024 | 08:42 AM

పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయడమే తమ ముందున్న ప్రథమ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు.

న్యూ ఢిల్లీ: పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయడమే తమ ముందున్న ప్రథమ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, కేంద్రంలో టీడీపీకి లభించిన ప్రాధాన్యత, గన్నవరంలో చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు తదితరాలపై ఆయన స్పందించారు.


చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర క్యాబినెట్‌లో ఇద్దరు ఎంపీలకు అవకాశం కల్పించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎంపీలందరూ సమన్వయంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఆంధ్రప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కృషిచేస్తామన్నారు. ఇందుకు కేంద్రంలోని ఏఏ శాఖల నుంచి నిధులు రావాలో తెలుసుకుని వాటిని సాధించేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయడమే తమ ముందున్న ప్రథమ లక్ష్యమన్నారు. జగన్‌పై ప్రజలు ఓట్ల రూపంలో తిరుగుబాటు చేశారని వ్యాఖ్యానించారు.


చంద్రబాబును కలిసిన కేశినేని శివనాథ్‌

భారత ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకార మహోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం జరిగింది. మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం పార్లమెంట్‌ భవన్‌లో కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌, అమలాపురం ఎంపీ జీఎం హరీష్‌ బాలయోగి, వైశాఖ ఎంపీ శ్రీభరత్‌తో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ మర్యాదపూర్వకంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును కలిసారు.

Read more AP News and National News

Read more!

Updated Date - Jun 10 , 2024 | 10:36 AM

Advertising
Advertising