Andhra Cricket Association Elections: అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఎన్నిక
ABN, Publish Date - Sep 08 , 2024 | 07:48 PM
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన పాలక వర్గం ఎన్నిక ఏకగ్రీవం కావడం శుభ పరిణామమని ఆ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్రికెట్ వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 08: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన పాలక వర్గం ఎన్నిక ఏకగ్రీవం కావడం శుభ పరిణామమని ఆ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఏసీఏ అధ్యక్షుడిగా శివనాథ్ ఎన్నికైన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్రికెట్ వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ఏడాదిలోపే సిద్దం చేసి రాజధాని ప్రాంతానికి అందిస్తామని తెలిపారు. ఈ స్టేడియంలో ఆ మరుసటి ఏడాది అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అలాగే విశాఖపట్నంలో రెండో క్రికెట్ స్టేడియం నిర్మాణంతోపాటు అన్ని జిల్లాల్లో క్రికెట్ గ్రౌండ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు.
Also Read: AP Rains: వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా కదిలొస్తున్న దాతలు
Also Read: Kolkata: ఈడీ తనిఖీలు.. రూ. 6.5 కోట్ల విలువైన బంగారం పట్టివేత
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న జిల్లా క్రికెట్ అసోసియేషన్లకు, క్రికెట్ క్లబ్‌లకు ఈ సందర్భంగా కేశినేని చిన్ని ధన్యవాదాలు తెలిపారు. అలాగే విజయవాడలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. నగరంలో ఇప్పటి వరకు స్టేడియం లేని లోటును మంగళగిరి స్టేడియం తీరుస్తుందన్నారు.
Also Read: Bihar: మగధ్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
కడపలో గత పాలకవర్గం హయాంలో నిర్మించిన స్టేడియాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మన ఆటగాళ్ల అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా అకాడమీలు స్థాపించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఏసీఏలో బయటి వారి జోక్యం ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే గత పాలక వర్గంలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Also Read: Video Viral: వీడెవడండీబాబు.. వినాయకుడి చేతిలో లడ్డూ ఎత్తుకెళ్లాడు..
వరద బాధితుల సహాయార్థం ఏసీఏ తరఫున సీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళంగా ఎంపీ కేశినేని చిన్ని ప్రకటించారు. ఆదివారం విజయవాడలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని పదవులు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ సందర్భంగా ప్రకటించారు.
Also Read: Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పి.వెంకట రమణ ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీష్ బాబు, జాయింట్ సెక్రటరీగా పి. విష్ణు కుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా డి. గౌర్ విష్ణు తేజ్‌లు పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read More National News and Latest Telugu News Click Here
Updated Date - Sep 08 , 2024 | 08:15 PM