ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Lokesh: లోకేశ్ సమక్షంలో ఐఐటి మద్రాసుతో కీలక ఒప్పందాలు

ABN, Publish Date - Nov 15 , 2024 | 07:59 PM

గత వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలపై పెట్టిన శ్రద్ధ.. రాష్ట్రాభివృద్ధిపై పెట్టులేదు. దీంతో రాష్ట్రంలోని యువత..ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయింది. అలాగే వివిధ పరిశ్రమలు సైతం రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాయి.

అమరావతి, నవంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని పురోగామి దిశగా తీసుకు వెళ్లేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా అధునాతన సాంకేతికతను అంది పుచ్చుకోవడమే లక్ష్యంగా పలు సంస్థలతో కీలక ఒప్పందాలు సైతం చేసుకుంటుంది. ఆ క్రమంలో శుక్రవారం మద్రాస్ ఐఐటీతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో 8 విభాగాలు ఒప్పందం చేసుకున్నాయి.

Also Read : పిచ్చి లేఖలు రాయడం మానుకోండి..


మద్రాస్ ఐఐటీతో ఒప్పందం..

రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడం, అధునాతన సాంకేతికత, పరిశోధన ఫలాలను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు శిక్షణ ఇవ్వడం తదితర అంశాలపై మద్రాస్ ఐఐటీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
Also Read: ఆ సమస్యలను పట్టించుకోరా అని మండిపాటు


ఉదయం చర్చలు.. సాయంత్రం ఒప్పందాలు..

అయితే ఈ రోజు ఉదయం సీఎం చంద్రబాబు సమక్షంలో మద్రాస్ ఐఐటీ ప్రతినిధులతో చర్చలు జరిగాయి. అవి ఫలవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాసు, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు మధ్య ఈ కీలక ఒప్పందాలు కుదిరాయి.

Also Read: గాడిద పాలు పేరుతో రూ. 100 కోట్ల మోసం..


పట్టం కట్టారు.. అంతే..

మరోవైపు ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు కూటమికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో రాష్ట్రానికి పరిశ్రమలు, యువతికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం సీఎం చంద్రబాబుతోపాటు ఆయన కేబినెట్ మంత్రులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: కాంగ్రెస్‌లోకి త్వరలో కారు పార్టీ ఎమ్మెల్యేలు


వెనక్కి వచ్చిన లులు సైతం

దీంతో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని వదిలి వెళ్లిన లులు లాంటి సంస్థలు సైతం మళ్లీ తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అలాగే రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన పనులు సైతం వేగవంతమయ్యాయి.

Also Read:: అన్మోలా మజాకా.. దీని మెనూ చూస్తే కళ్లు తేలేయాల్సిందే


టాటా సంస్థ సైతం..

ఇక టాటా సంస్థ సైతం ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అదే విధంగా పలు ఐటీ సంస్థలు కూడా విశాఖపట్నంతోపాటు పలు నగరాల్లో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Also Read: నల్ల నువ్వుల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?


ఒక్క సంక్షేమమే..

ఇంకోవైపు గత వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలపై పెట్టిన శ్రద్ధ.. రాష్ట్రాభివృద్ధిపై పెట్టులేదు. దీంతో రాష్ట్రంలోని యువత..ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయింది. అలాగే వివిధ పరిశ్రమలు సైతం రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నట్లుగా.. కూటమికి తన ఓటు ద్వారా మద్దతు ప్రకటించాడు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 15 , 2024 | 07:59 PM