Tirumala: వీఐపీ బ్రేక్ దర్శనంపై కీలక నిర్ణయాన్ని వెల్లడించిన టీటీడీ ఈవో
ABN, Publish Date - Apr 05 , 2024 | 01:49 PM
తిరుమలలో యాత్రికుల మొబైల్‌కు టీటీడీ సిగ్నల్స్ సరిగ్గా లేకపోతే మెసేజ్ రావటం లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మొబైల్ సిగ్నల్స్ తిరుమలలో ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకుటామంటామన్నారు. గది తీసుకున్న వ్యక్తే మళ్లీ గది ఖాళీ చేయకపోతే రిఫండ్ వెళ్లటం లేదన్నారు..
తిరుపతి: తిరుమల (Tirumala)లో యాత్రికుల మొబైల్‌కు టీటీడీ సిగ్నల్స్ సరిగ్గా లేకపోతే మెసేజ్ రావటం లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మొబైల్ సిగ్నల్స్ తిరుమలలో ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకుటామంటామన్నారు. గది తీసుకున్న వ్యక్తే మళ్లీ గది ఖాళీ చేయకపోతే రిఫండ్ వెళ్లటం లేదన్నారు.. దీనిపైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీవారి సేవకులకు తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసంలో అకామిడేషన్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
TDP: విజయవాడ రిటైనింగ్ వాల్‌పై అసలు వాస్తవాలు ఇవే.. బయటపెట్టిన టీడీపీ
వీఐపీ బ్రేక్ దర్శనంలో కూడా టీటీడీ ఈవో కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కూడా ఇక మీదట లక్కి డిప్‌లో ఇస్తామన్నారు. ఉగాది సందర్భంగా తెలుగు క్యాలెండర్‌ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. శ్రీ వాణి టిక్కెట్లు కోరినన్ని ఇస్తున్నామన్నారు. కోడ్ ఆఫ్ కండాక్ట్ నేపథ్యంలో 200 నుంచి 250 మాత్రమే వీఐపీ బ్రేక్ టిక్కెట్లు ఇస్తున్నామన్నారు. దీని వల్ల జూన్ 4 వరకూ రోజుకు రెండు గంటల సమయం సామాన్య భక్తులకు దర్శన సమయం పెరుగుతుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
AP Politics: చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి రఘురామకృష్ణం రాజు..!
మరిన్ని ఏపీ వార్తల కోసం...
Updated Date - Apr 05 , 2024 | 01:49 PM