ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala Laddu: టీడీపీ- వైసీపీ నేతల సవాళ్లు

ABN, Publish Date - Sep 19 , 2024 | 05:29 PM

తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల నెయ్యి వాడారని కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నిర్ధారించింది. ఆ నివేదికతో వైసీపీ నేతలు ఏం మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. అంతకుముందు ఏపీ సర్కార్‌కు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఛాలెంజ్ చేశారు.

YV Subba Reddy

అమరావతి: తిరుమల లడ్డూ (Laddu) ప్రసాదంలో జంతువుల నెయ్యి ఉపయోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రమే ఉపయోగించామని, ఏ జంతువు నెయ్యి వాడలేదని స్పష్టం చేశారు. ఇదే అంశంపై తిరుమల దేవస్థానంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వైవీ సవాల్‌పై టీడీపీ నేత కొలికిపూడి శ్రీనివాస్ స్పందించారు.



ప్రమాణం చేద్దామా..

‘తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతపై కొలికిపూడి శ్రీనివాస్ స్పందించారు. తిరుమల ప్రసాదం మీద ప్రమాణం చేద్దామని కోరారు. ఎప్పుడు, ఎక్కడ ప్రమాణం చేద్దామో మీరే చెప్పండి. ఏ రోజైనా వైసీపీ నేతలు, ఆ పార్టీ అధినేత జగన్ మాట మీద నిలబడ్డారా..? జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టకముందు వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ కోరారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆ అంశాన్నే మరిచారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా ఇలానే జరిగింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో అవకతవకలు జరిగాయి. దమ్ము, ధైర్యం ఉంటే విచారణ కోసం డిమాండ్ చేయండి అని’ కొలికిపూడి శ్రీనివాస్ సవాల్ విసిరారు.



నిర్ధారణ

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నిర్ధారించింది. శ్రీవారి లడ్డూను జూలై 8వ తేదీన ల్యాబ్‌కు పంపించగా, 17వ తేదీన నివేదిక అందజేసింది. నెయ్యిలో సోయాబిన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలు, చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు వాడారని నివేదికలో పేర్కొంది. నెయ్యి కొనుగోళ్లలో ఎలాంటి నాణ్యత పాటించలేదని వివరించింది. లడ్డూ ప్రసాదంలో జంతువుల నెయ్యి వాడారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి ఆధారాలతో సహా నిరూపించారు.


ఇవి కూడా చదవండి...

Tirumala Laddu: తిరుమల లడ్డూలో నాసిరకం నెయ్యి వాడకం ఓ మాజీ అధికారి పుణ్యమే: ఓవీ రమణ

YV Subbareddy: టీటీడీ లడ్డుపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా...వైవీ ఫైర్

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 19 , 2024 | 08:19 PM

Advertising
Advertising