Nara Lokesh: మంత్రి లోకేష్ ఇచ్చిన మాట.. 3 రోజుల్లోనే అమలైన హామీ..
ABN, Publish Date - Jun 19 , 2024 | 07:05 AM
అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం మూడు రోజుల్లోనే హామీ అమలైంది. ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలపై జీవో విడుదల చేశారు. విద్యాశాఖలో శరవేగంగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు.
అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఇచ్చిన మాట ప్రకారం మూడు రోజుల్లోనే హామీ అమలైంది. ఇంటర్ విద్యార్థులకు (Inter Students)ఉచిత పాఠ్యపుస్తకాలపై (Free Textbooks) జీవో (GO) విడుదల చేశారు. విద్యాశాఖలో శరవేగంగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఈనెల 15వ తేదీన ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి లోకేష్ విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించే విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) పాఠ్యపుస్తకాలు ఇవ్వడం నిలిపివేసిందని లోకేష్ తెలుసుకున్నారు.
పుస్తకాలు లేకుండా పేద విద్యార్థులు ఎలా చదువుతారని ఆ సమావేశంలోనే అధికారులను మంత్రి లోకేష్ ప్రశ్నించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తక్షణమే ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్‌తోపాటు బ్యాక్ ప్యాక్ అందజేయాలని ఆదేశించారు. జూలై 15 నాటికి పాఠ్యపుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించడంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం జీవో ఎం.ఎస్. నెం.28ని విడుదల చేశారు. త్వరలోనే పుస్తకాలు పంపిణీ కూడా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.
జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్..
కాగా ఈవీఎంలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్(Minister Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు. "2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు గెలిస్తే ఈవీఎం(EVM)లు బాగా పని చేసినట్లు, 2024లో ఓడిపోతే ఈవీఎంలపై నింద మోపుతావా? అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. నీ వైఫల్యాలతోనే ప్రజలు నిన్ను తిరస్కరించారంటూ" జగన్ చేసిన ట్వీట్‌కు కౌంటర్‌గా మంత్రి లోకేశ్ మరో ట్వీట్ చేశారు.
ఇంకా ఏమన్నారంటే..?
2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో EVMలు బాగా పని చేస్తున్నాయని చెప్పారు కదా జగన్.. మరి ఇప్పుడేమైంది. ప్రజాస్వామ్యం అంటే మీకు ఎలర్జీ. మీరు ప్రజల హక్కులను పరిరక్షించడానికి అంకితమైన సంస్థలు, వ్యవస్థలు క్రమపద్ధతిలో నాశనం చేశారు. ఏళ్ల తరబడి ఏపీ ప్రజలు సమష్టిగా నిర్మించిన వాటిని ఒక్క దెబ్బతో కొట్టిపారేశారు. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ సంస్థల్ని, వ్యవస్థల్ని నాశనం చేశారు. మీరు ప్రజల హక్కులను హరించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టుకున్న ప్రభుత్వ ఫర్నిచర్ ఎప్పుడు వెనక్కు పంపుతున్నారో చెప్పాలి. పేదల పేరు చెప్పే మీరు రుషికొండలో రూ.560కోట్లతో ప్యాలెస్ ఎలా నిర్మించుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడుగుతున్నారు. ప్రజలు ఎందుకు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారో ఆలోచించి అంగీకరించండి" అంటూ మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు మళ్లీ తగ్గాయోచ్.. కానీ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 19 , 2024 | 07:15 AM