ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: అక్రమాలపై నిలదీసినందుకు ప్రిన్సిపాల్ ఎంతటి ఓవరాక్షన్ చేశాడంటే..

ABN, Publish Date - Sep 12 , 2024 | 04:24 PM

Andhrapradesh: అరకులోయ మహిళా డిగ్రీ కళాశాలలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. గత కొంతకాలంగా విద్యార్థుల దగ్గర నుంచి కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, స్టోర్ కీపర్ ప్రతిదానికి డబ్బులు వసూలు చేస్తున్నారు. టీసీల కోసం ఫీజు, సెమిస్టర్ పాసైన సర్టిఫికెట్ కోసం ఫీజు, ఫ్రీ అడ్మిషన్లకు కూడా 9800 చొప్పున ప్రతి డిగ్రీ ప్రొవిజనల్ కోసం రూ.200 ఇలా ప్రతిదానికి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడు.

strange incident at a womens degree college Arakuloya

విశాఖపట్నం, సెప్టెంబర్ 12: విద్యార్థులను సరైన మార్గంలో నడిపించడమే ప్రిన్సిపాల్ బాధ్యత. తమ స్కూల్‌ గానీ, కాలేజీలకు వచ్చే వందల మంది విద్యార్థులకు విద్యతో, క్రమశిక్షనను కూడా నేర్పించాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్‌పై ఉంటుంది. అయితే విద్యార్థులు సరైన మార్గంలో నడిపించాల్సిన ప్రిన్సిపాలే పైసలకు కక్కుర్తి పడ్డాడు. ప్రతీదానికి ఫీజులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ విషయంపై విద్యార్థులు నిలదీయగా సదరు ప్రిన్సిపాల్ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు సుమా. అరకులోయ మహిళా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ చేసిన పనికి అందరూ ఛీ అనకుండా ఉండలేదు.

Sitaram Yechury: సీతారాం ఏచూరి కన్నుమూత



అరకులోయ మహిళా డిగ్రీ కళాశాలలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. గత కొంతకాలంగా విద్యార్థుల దగ్గర నుంచి కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, స్టోర్ కీపర్ ప్రతిదానికి డబ్బులు వసూలు చేస్తున్నారు. టీసీల కోసం ఫీజు, సెమిస్టర్ పాసైన సర్టిఫికెట్ కోసం ఫీజు, ఫ్రీ అడ్మిషన్లకు కూడా 9800 చొప్పున ప్రతి డిగ్రీ ప్రొవిజనల్ కోసం రూ.200 ఇలా ప్రతిదానికి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడు. గతంలో ఒకటి రెండు సార్లు ఈ విషయమై విద్యార్థులు హెచ్చరించారు. అయితే అక్రమాలపై నిలదీసినందుకు ప్రిన్సిపల్ ఓవరాక్షన్‌కు దిగారు.

TG Politics: కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి.. గ్రేటర్‌లో వేడెక్కిన రాజకీయం


విద్యార్థుల ప్రవర్తన గమనించిన సదరు ప్రిన్సిపల్ బీపీ ఎక్కువ అయిపోయినట్టు, ఫిట్స్ వచ్చినట్టు నటిస్తూ కింద పడిపోయాడు. దీంతో వెంటనే ప్రిన్సిపల్‌‌ను అంబులెన్సులో హాస్పిటల్ కి తరలించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. అయితే అంబులెన్స్ ఎక్కడానికి ఆ ప్రిన్సిపాల్ నిరాకరించాడు. చివరకు బీపీ పరీక్షించగా నార్మల్‌గా ఉన్నట్టు వైద్య సిబ్బంది తేల్చేశారు. బీపీ పరీక్షించే వ్యక్తితో 200 దాటిపోయిందని చెప్పమని బ్రతిమాలాడటం ఈ ఘటనలో కోస మెరుపు.


ఇవి కూడా చదవండి...
YS Sharmila: ఏలేరు ఆధునికీకరణను జరగకపోవడం వల్లే ఇంతటి విపత్తు

Nimmala: బోట్లు తొలగింపులో అనుభవం ఉన్న అబ్బులును తీసుకొస్తున్నాం

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 12 , 2024 | 07:59 PM

Advertising
Advertising