AP News: సిమెంటు కర్మాగారంలో ప్రమాదం.. మృతుని కుటుంబసభ్యుల ఆందోళన..
ABN, Publish Date - Jul 08 , 2024 | 07:31 AM
ఎన్టీఆర్ జిల్లా: బూధవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ వద్ద ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఆవాల వెంకటేశ్ (35) మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వారితో కలిసి మాట్లాడారు.
ఎన్టీఆర్ జిల్లా: బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ వద్ద ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఆవాల వెంకటేశ్ (35) మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వారితో కలిసి మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చనిపోయిన కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పటికే క్షతగాత్రులకుమెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాల మేరకు జిల్లా స్థాయి అధికారులు హాస్పటల్ వద్దనే పర్యవేక్షణ చేస్తున్నారని వారికి తెలిపారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వపరంగా.. కర్మాగారం నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహాయ నిధి నుంచి ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఎటువంటి గొడవలకు దిగొద్దని సంయమనం పాటించాలని సూచించారు. కాగా కర్మాగారంలో ప్రమాదం జరిగిన నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2వందల మంది సిబ్బందితో అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదం ఆదివారం జరిగిన విషయం తెలిసిందే.
అల్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఒక కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మరో 15 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో ఉన్న అలా్ట్రటెక్ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ కర్మాగారంలో మొత్తం 300-500 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో స్థానిక బూదవాడ గ్రామస్థులతోపాటు ఎక్కువమంది బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు మొత్తం మూడు షిప్టుల్లో విధులు నిర్వర్తిస్తుంటారు. సిమెంట్ తయారీకి ఐదు దశలు ఉంటాయి. మొదటి దశలో సున్నపురాయి (లైమ్ స్టోన్)ను ముక్కలు చేస్తారు.
రెండో దశలో ఎర్రమట్టి, బొగ్గు, ఫ్లైయాష్‌ను మిక్సింగ్ చేస్తారు. దీన్ని కెలన్ దశగా వ్యవహరిస్తారు. ఈ దశ దాటాక ఈ మొత్తం మిశ్రమం పొడిగా మారుతుంది. దీన్ని క్లింకర్ దశగా పిలుస్తారు. ఆదివారం ఉదయం షిఫ్టునకు వచ్చిన 30 మంది కార్మికులు కెలన్ (మిక్సింగ్ బాయిలర్) వద్ద పనిచేస్తున్నారు. ఈ బాయిలర్‌ను 1,200 నుంచి 1,400 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మండిస్తారు. ఈ సమయంలో ఇది ఒక్కసారిగా పేలడంతో వేడి మిశ్రమం అక్కడే ఉన్న కార్మికులపై పడింది. ఈ పేలుడు శబ్దానికి కొంతమంది కార్మికులు అక్కడి నుంచి పారిపోయారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఎ నిమిది మందిని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఆవుల వెంకటేశ్ (36) అనే కార్మికుడు మృతిచెందాడు. పి అర్జునరావు, బి స్వామి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మిగిలిన ఐదుగురి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: చంద్రబాబు
అల్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై అధికారులతో మాట్లాడారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడటంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా సాయం అందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
Updated Date - Jul 08 , 2024 | 07:31 AM