ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: వైసీపీ నేతల్లో పెరుగుతున్న ఆందోళన.. జగన్ తీరుతో కేడర్ డీలా..

ABN, Publish Date - Sep 10 , 2024 | 08:29 AM

వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయం తప్పిదాల కారణంగానే ఎన్నికల్లో ఓడిపోవల్సి వచ్చిందని ఆ పార్టీకి చెందినే నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను లక్షంగా చేసుకుని ..

YSRCP

వైసీపీ అధినేత జగన్ తీరుతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత వైసీపీకి సీనియర్లు కొందరు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరికొందరు నేతలు ఇప్పటికే జగన్‌కు గుడ్‌బై చెప్పేశారు. వైసీపీ అధ్యక్షులు జగన్ సైతం ఎన్నికల తర్వాత బెంగళూరులో ఎక్కువుగా ఉంటున్నారు. వారంలో సగం రోజులు తాడేపల్లిలో.. మరో సగం రోజులు బెంగళూరులో ఉంటూ వస్తున్నారు. ఏపీకి వచ్చినప్పుడు కొందరు పార్టీ నాయకులతో సమావేశమై మమ అనిపిస్తున్నారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో జగన్ ఏం చేశారో.. ప్రస్తుతం అధికారం కోల్పోయిన తర్వాత అదే రీతిలో వ్యవహరిస్తున్నారని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుందట. కొందరు నేతలకు ప్రాధాన్యమిచ్చి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను విస్మరించడం వలనే ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిందని పార్టీలో నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తారని ఆశించినవారికి నిరాశే ఎదురవుతుందట. జగన్ వైఖరితో తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటనే ఆందోళనలో పార్టీ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.

Rain Alert: వరద సహాయక చర్యల్లో మంత్రి నారాయణ


కేడర్ డీలా..

వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయం తప్పిదాల కారణంగానే ఎన్నికల్లో ఓడిపోవల్సి వచ్చిందని ఆ పార్టీకి చెందినే నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను లక్షంగా చేసుకుని వేధించడం, విపక్షాలకు కనీసం గౌరవం ఇవ్వని కారణంగా క్షేత్రస్థాయిలో ప్రస్తుతం తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని కొందరు పార్టీ నాయకులు వాపోతున్నారు. గతంలో రాజకీయ కక్ష సాధింపులు ఎక్కువుగా ఉండేవి కావని, గెలుపోటములతో సంబంధం లేకుండా స్థానికంగా అన్ని పార్టీల నాయకులు కలిసి ఉండేవాళ్లమని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో స్నేహ పూర్వక వాతావరణాన్ని చెడగొట్టిందనే చర్చ క్షేత్రస్థాయిలో జరుగుతోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ కేడర్ పూర్తిగా డీలా పడిందని, కనీసం అధిష్టానం, జిల్లాస్థాయి నాయకులు తమను పట్టించుకోవడం మానేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడితే.. అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎలాంటి ఉపయోగం లేదని, అధికారం కోల్పోయిన తర్వాత తమను అధిష్టానం పూర్తిగా పట్టించుకోవడం లేదని క్షేత్రస్థాయిలో వైసీపీ శ్రేణులు కొందరు తమ మనసులోని అభిప్రాయాలను బయటపెడుతున్నారట.

ఉత్తరాంధ్రలో కుంభవృష్ఠి


అవకాశాలు లేకపోవడంతో..

వైసీపీని వీడి వేరే పార్టీలో చేరేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నప్పటికీ.. కూటమి పార్టీలు చేరికల విషయంలో కొన్ని నిబంధనలు పెట్టుకున్నాయి. దీంతో పార్టీ మారడానికి అవకాశం లేకుండా పోయింది. అధికార పక్షంలో ఉంటూ గత ఐదేళ్లూ ప్రతిపక్ష నేతలను వేధించడం, అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టడంలో భాగస్వాములైన నాయకులను ఎట్టిపరిస్థితుల్లో పార్టీలో చేర్చుకునేది లేదని టీడీపీ, జనసేన స్పష్టం చేయడంతో చేసేదేమి లేక వైసీపీలో కొనసాగాల్సి వస్తుందట. కాంగ్రెస్‌లోకి వెళ్దామంటే ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో కొంతకాలం వేచిచూసే ధోరణిలో కొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ తీరు మారకపోతే మాత్రం కాంగ్రెస్‌లోనైనా చేరేందుకు మాజీ కాంగ్రెస్ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.


కష్టం.. నష్టం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Sep 10 , 2024 | 08:29 AM

Advertising
Advertising