Purandeshwari: లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ముందుకు అడుగులు..
ABN, Publish Date - Aug 21 , 2024 | 12:56 PM
Andhrapradesh: నగరంలో బీజేపీ సభత్వ నమోదు కార్యక్రమం బుధవారం ఉదయం ప్రారంభమైంది. సభ్యత్వ నమోదుపై అవగాహన సమావేశాన్ని ఏపీ బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది మన బాధ్యత అని.. లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
విజయవాడ, ఆగస్టు 21: నగరంలో బీజేపీ సభత్వ నమోదు కార్యక్రమం బుధవారం ఉదయం ప్రారంభమైంది. సభ్యత్వ నమోదుపై అవగాహన సమావేశాన్ని ఏపీ బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది మన బాధ్యత అని.. లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి బాధ్యత అందరి మీద ఉందన్నారు.
Ponguleti Srinivas: టూరిజం ప్లేస్‌గా నేలకొండపల్లి అభివృద్ధే లక్ష్యం..
పాశ్చాత్య ఆలోచన ధోరణికి స్వస్తి పలికెందుకు బీజేపీ ఆవిర్భావం అయ్యిందన్నారు. బీజేపీ ఆవిర్భావం నుంచి ఒక సిద్ధాంతంతో, కార్యకర్త బలంతో ముందుకు వెళ్తోందని చెప్పారు. 1984 లో పార్లమెంట్ సభల్లో ఇద్దరితో మొదలైన ప్రయాణం ప్రస్తుతం దేశ అభివృద్ధి కొరకు బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. భారతీయ సంస్కృతి విధి విధానాలతో బీజేపీ పని చేస్తుందన్నారు. మోదీ నాయకత్వంలో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సిద్ధాంతంతో ముందుకు వెళ్తోందన్నారు. ఈ సిద్ధాంతం అనేది మన లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఉంటుందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో గెలవలేకపోయినా ఆయా రాష్ట్రాల అభివృద్ధి కొరకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
కరోనా ఉన్న సమయంలో బీజేపీ కార్యకర్తలు ప్రజలకు దగ్గరగా ఉండి సేవని అందించారని గుర్తుచేశారు. కార్యకర్తలే బీజేపీకి బలమన్నారు. రాష్ట్రంలో 37 లక్షల వరకు సభ్యత్వం ఉన్నారన్నారు. మోదీ ఆధ్వర్యంలో భారతదేశం అతి పెద్ద ఐదోవ ఆర్థిక శక్తిగా ఎదిగిందని వెల్లడించారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అమలు చేయగలుగుతున్నామన్నారు. మూడో ఆర్థిక శక్తిగా ఉంటే ఇంకా ఎక్కువుగా పేదల కోసం పని చేస్తామని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి పేర్కొన్నారు.
Tadipatri: ఏబీఎన్ జర్నలిస్టును కాల్చేస్తానన్న వైసీపీ నేత.. పోలీసులు ఏం చేశారో తెలుసా?
సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు ఉత్తర్ ప్రదేశ్ మాజీ మంత్రి ప్రయాగ్ రాజ్, ఎమ్మెల్యే సిద్దార్ధ నాధ్ సింగ్, అరవింద్ మీనన్ (రాష్ట్ర బిజెపి సభ్యత్వ ఇంచార్జి ) మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సోము వీర్రాజు, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సభ్యత్వ నమోదుపై క్యాడర్‌కు బీజేపీ కేంద్ర, రాష్ట్ర ముఖ్య నాయకులు దిశా నిర్దేశం చేశారు. మూడు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ చేస్తోంది. ఏపీలో బీజేపీ ఎమ్మెల్యేల గెలుపుతో సభత్వ నమోదుపై బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఈ ఐదు సంవత్సరాలలో ఏపీలో పార్టీ బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేపట్టింది.
ఇవి కూడా చదవండి...
Narendra Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. పోలాండ్, ఉక్రెయిన్‌లో మూడు రోజుల పర్యటన!
TG Highcourt: వివేకా కేసులో ఉదయ్‌కు బెయిల్ మంజూరు
Read Latest AP News And Telugu News
Updated Date - Aug 21 , 2024 | 01:03 PM