CM Chandrababu: రాజస్థాన్ సీఎంతో ఫోన్‌లో మాట్లాడిన ఏపీ సీఎం
ABN, Publish Date - Oct 08 , 2024 | 12:39 PM
Andhrapradesh: విజయవాడ నుంచి వెళ్లిన న్యాయవాదుల బృందం బస్సు రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాద ఘటనపై ఆ రాష్ట్ర సీఎంతో చంద్రబాబు మాట్లాడారు. బాధితులకు అవసరమైన సాయం అందిచాలని సీఎం కోరారు.
అమరావతి, అక్టోబర్ 8: రాజస్థాన్ ముఖ్యమంత్రి బజన్ లాల్ శర్మతో (Rajasthan Chief Minister Bajan Lal Sharma) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఫోన్‌లో మాట్లాడారు. విజయవాడ నుంచి వెళ్లిన న్యాయవాదుల బృందం బస్సు రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాద ఘటనపై ఆ రాష్ట్ర సీఎంతో చంద్రబాబు మాట్లాడారు. బాధితులకు అవసరమైన సాయం అందిచాలని సీఎం కోరారు. ప్రమాదంలో విజయవాడకు చెందిన ప్రముఖ అడ్వకేట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి జోత్స్న మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై రాజస్థాన్ సీఎంతో మాట్లాడి ప్రమాద బాధితులకు మెరుగైన సాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. అడ్వకేట్లు తిరిగి ఇంటికి రావడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సీఎం చంద్రబాబు కోరారు.
Big Tree: ఎంతటి దుర్మాగం.. హెచ్చిరించనా లెక్క చేయక.. 50 ఏళ్ల చెట్టును
చంద్రబాబు దిగ్భ్రాంతి...
రాజస్థాన్‌లో విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతిచెందడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యం పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన సీఎం... వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Assembly Elections: రెండు రాష్ట్రాల్లో లీడ్‌లో ఉన్న ప్రముఖులు వీరే
లోకేష్ స్పందన..
అలాగే విజయవాడ బారు అసోసియేషన్ సభ్యుల రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ‘‘మహిళా భద్రత, సాధికారత కోసం ఉద్యమించిన ప్రముఖ సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి గొల్లపల్లి జ్యోత్స్న రాజస్థాన్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. విహారయాత్ర విషాదయాత్రగా మారడం బాధాకరం. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేంద్ర ప్రసాద్ గారు, న్యాయవాదులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
కాగా.. బెజవాడ బార్ అసోసియేషన్ నిర్వహించిన టూర్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు వెళ్ళే మార్గంలో వీరు ప్రయాణించిన బస్సుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రముఖ న్యాయవాది, అఖిల భారత లాయర్ల సంఘం ప్రధాన కార్యదర్శి సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే సుంకర రాజేంద్ర ప్రసాద్‌తో పాటు మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి స్థానిక అధికారులు తరలించారు. ఈ ప్రమాదంలోసుంకర రాజేంద్ర ప్రసాద్‌కు కంటి మీద గాయాలు అయ్యాయి.
ఇవి కూడా చదవండి..
Buddavenkanna: నువ్వా పేదల కోసం మాట్లాడేది.. జగన్‌పై బుద్దా ఫైర్
Bhanuprakash: ఆర్జీవీ.. జగన్‌పై అలా సినిమా తీస్తే బాగుంటుందేమో..
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 08 , 2024 | 01:22 PM