ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. వైఎస్సార్ లా నేస్తం పేరు మార్పు..

ABN, Publish Date - Sep 19 , 2024 | 07:29 AM

అమరావతి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘వైఎస్సార్ లా నేస్తం’ పేరు మార్పు చేస్తూ.. ‘న్యాయ మిత్ర’గా మార్చింది. లా డిపార్ట్‌మెంట్‌లో అమలవుతున్న ఈ పథకాన్ని ‘న్యాయ మిత్ర’గా మార్చాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలు నిర్ణీత సమయంలో జారీ చేయబడతాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది.

అమరావతి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం (AP Govt Sensational decision) తీసుకుంది. ‘వైఎస్సార్ లా నేస్తం’ (YSR Law Nestham) పేరు మార్పు (Name Change) చేస్తూ.. ‘న్యాయ మిత్ర’ (Nyaya Mitra)గా మార్చింది. లా డిపార్ట్‌మెంట్‌లో అమలవుతున్న ఈ పథకాన్ని ‘న్యాయ మిత్ర’గా మార్చాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలు నిర్ణీత సమయంలో జారీ చేయబడతాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది. సీఈవో ఈ-(C.E.O e)-ప్రగతి అథారిటీ విషయంలో తదనుగుణంగా తదుపరి అవసరమైన చర్య తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి వి సునీత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం ద్వారా న్యాయ శాస్త్రం ప‌ట్టా చేత‌ప‌ట్టుకుని న్యాయ‌వాద వృత్తిలోకి కొత్తగా అడుగుపెట్టిన జూనియ‌ర్ న్యాయ‌వాదుల‌కు ప్రతి నెలా రూ. 5వేలు స్టైపండ్ ఇస్తారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం 2019 డిసింబ‌ర్‌లో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించింది.


కాగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీల, పథకాల అమలుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని హామీలు, పథకాలను అమలు చేస్తోంది.. మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే గత జగన్ సర్కార్ హయాంలో ఉన్న కొన్ని పథకాలను కొనసాగిస్తోంది.. కాకపోతే వాటికి పేర్లు మారుస్తోంది. ఇప్పటికే కొన్ని పథకాలకు పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా వైఎస్పార్ లా నేస్తం పేరు మార్పు చేస్తూ.. ‘న్యాయ మిత్ర’గా మార్చింది. ఈ పథకం పేరు మార్చినా కొనసాగించడంపై జూనియర్ న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేశారు.


ఇంకా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్’గా ప్రభుత్వం మార్చింది. ఎస్సీలకు అమలవుతున్న జగనన్న విద్యాదీవెన పథకం ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’గా.. వైఎస్సార్ కళ్యాణ మస్తు పేరును ‘చంద్రన్న పెళ్లి కానుక’గా.. వైఎస్సార్ విద్యోన్నతి పథకం పేరును ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’గా.. జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పేరును ‘సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకాలు’గా మార్చింది. జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. మన బడి - నాడు నేడును మన బడి - మన భవిష్యత్తుగా మార్చారు. ‘జగనన్న ఆణిముత్యాలు’ను ‘అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారం’గా మార్చారు. అలాగే 'శాశ్వత భూ హక్కు-శాశ్వత భూ రక్ష' పథకం పేరును 'ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్'గా మారుస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని భూ పరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఇవే కాకుండా మరికొన్ని పథకాలకు కూడా పేర్లు మార్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీకి బిగ్‌ షాక్‌

మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 19 , 2024 | 07:42 AM

Advertising
Advertising