Viveka Case: వివేకా కేసులో ప్రధాన సాక్షి సెక్యూరిటీపై హైకోర్టు ఏం చెప్పిందంటే?
ABN, Publish Date - Jul 29 , 2024 | 01:57 PM
Andhrapradesh: మాజీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి కొమ్మా శివచంద్రారెడ్డికి తొలగించిన సెక్యూరిటీని తక్షణం పురుద్ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన తనకు గతంలో కడప జిల్లా జడ్జి మంజూరు చేసిన సెక్యూరిటీ గన్మెన్లను ఉపసంహరించడంపై శివచంద్రారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా..
అమరావతి, జూలై 29: మాజీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka Case) ప్రధాన సాక్షి కొమ్మా శివచంద్రారెడ్డికి తొలగించిన సెక్యూరిటీని తక్షణం పురుద్ధరించాలని హైకోర్టు (AP HighCourt) ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన తనకు గతంలో కడప జిల్లా జడ్జి మంజూరు చేసిన సెక్యూరిటీ గన్మెన్లను ఉపసంహరించడంపై శివచంద్రారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా.. గతంలో తన కుటుంబానికి తనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉన్నదని విట్నెస్ ప్రొటెక్షన్ స్కీం 2018 క్రింద గన్‌మెన్‌ను పిటిషనర్ పొందిన విషయం తెలిసిందే. అయితే నాలుగు రోజుల క్రితం తనకున్న సెక్యూరిటీని ఏ విధమైన నోటీసు ఇవ్వకుండా కడప ఎస్పీ తొలగించారని పిటిషనర్ వాదన వినిపించారు.
KCR Vs Revanth: విద్యుత్ కొనుగోళ్లపై సభలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్
పిటిషనర్ తరపున న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్‌కు అతని కుటుంబానికి ప్రాణహాని ఉన్నందున తక్షణమే సెక్యూరిటీ పునరుద్దించవలసిందిగా వాదనలు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. కడప జిల్లా జడ్జి అనుమతి లేకుండా సెక్యూరిటీ ఉపసంహరించుకోవడం చట్ట విరుద్ధమని ఉన్నతన్యాయస్థానం స్పష్టం చేసింది. తక్షణమే పిటిషనర్‌కు గన్‌మెన్ ప్రొటెక్షన్ పునరుద్ధించాలని కడప జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. కడప జిల్లా జడ్జి అనుమతి లేకుండా గన్‌మెన్ ప్రొటెక్షన్ ఉపసంహరించవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Budda Venkanna: పెద్దిరెడ్డికి వీరప్పన్ అంటూ నామకరణం చేసిన టీడీపీ నేత
మరోవైపు వివేకా హత్య కేసులో నాలుగో నిందితుడు (ఏ-4)గా ఉన్న షేక్ దస్తగిరిని సాక్షిగా గుర్తిస్తున్నట్లు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రకటించింది. ఈ మేరకు తనను నిందితుడిగా కాకుండా సాక్షిగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి రఘురాం అనుమతించారు. అభియోగాలు నమోదు చేసే వరకు దస్తగిరిని నిందితుడిగా కాకుండా సాక్షిగానే గుర్తిస్తామని స్పష్టం చేశారు. వివేకా హత్య కేసు హైదరాబాద్‌కు బదిలీ కాకముందే దస్తగిరిని కడప కోర్టు అప్రూవర్‌గా గుర్తించింది. దస్తగిరి అప్రూవర్‌గా మారినప్పటి నుంచే ఈ కేసు కీలక మలుపులు తిరిగింది. తాజాగా దస్తగిరిని సీబీఐ కోర్టు సాక్షిగా గుర్తించడం అవినాశ్‌రెడ్డి, ఇతర నిందితులకు శరాఘాతంగా మారింది. ఈ కేసులో గూగుల్ టేకౌట్, కాల్‌డేటా, ఎలక్ర్టానిక్ ఎవిడెన్స్ కంటే దస్తగిరి సాక్ష్యం అత్యంత కీలకంగా మారింది. నిందితులు సైతం దస్తగిరి సాక్ష్యం తప్ప మరే ఇతర ఆధారాలు లేవని పదేపదే ఆరోపిస్తున్న తరుణంలో వారికి ఇది భారీ ఎదురుదెబ్బగా పరిణమించింది.
ఇవి కూడా చదవండి..
GST Scam: జీఎస్టీ స్కామ్.. ఏ5గా మాజీ సీఎస్... త్వరలో నోటీసులు
Budda Venkanna: పెద్దిరెడ్డికి వీరప్పన్ అంటూ నామకరణం చేసిన టీడీపీ నేత
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 29 , 2024 | 02:02 PM