Bonda Uma: విజయవాడ: బోండా ఉమ నిరసన దీక్ష
ABN, Publish Date - Feb 25 , 2024 | 01:55 PM
విజయవాడ: బీసీ హక్కులను పరిరక్షించాలని, నాగ వంశీ సాధికారిత కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు శుక్రవారం విజయవాడలో నిరసన దీక్ష చేపట్టారు.
విజయవాడ: బీసీ (BC) హక్కులను పరిరక్షించాలని, నాగ వంశీ సాధికారిత కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswararao) శుక్రవారం విజయవాడలో నిరసన దీక్ష (Protest) చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ (YCP) ఓటమి ఖాయమని జగన్ (Jagan) ఒప్పుకున్నారని, కనీసం 30 సీట్లలో విజయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. నియోజకవర్గాల ఇన్ ఛార్జిలు అంటూ నియమించారని, ఎమ్మెల్యేలను, మంత్రులను మరో నియోజకవర్గానికి బదిలీ చేశారని అన్నారు.
ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి (YV Subbareddy) ఇన్‌ఛార్జ్‌లు ఎమ్మెల్యే అభ్యర్థులు కాదని అంటున్నారని, సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని ఈ బదిలీలే చెబుతున్నాయని బోండా ఉమ అన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల రాష్ట్రం అన్ని విధాలా నాశనం అయ్యిందన్నారు. బీసీ కార్పొరేషన్‌కు నిధులు లేవని, స్కాలర్ షిప్‌లు లేవని, నిధులు మళ్లించి బీసీలను నయ వంచన చేసిన జగన్‌కు బుద్ధి చెప్పాలని పిలుపిచ్చారు. సీఎం నిజ స్వరూపం ప్రజలకు అర్ధమైందన్నారు. ఎన్ని మాయలు చేసినా జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కలేనన్నారు. చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని బోండా ఉమమహేశ్వరరావు వ్యాఖ్యానించారు.
Updated Date - Feb 25 , 2024 | 01:57 PM