TDP: ఆ సినిమా నిర్మాత, దర్శకుడిని ఎందుకు సన్మానించలేదు: బుద్దా వెంకన్న
ABN, Publish Date - Dec 01 , 2024 | 12:52 PM
రాంగోపాల్ వర్మకు దమ్ముంటే.. ధైర్యంగా నిలబడాలని.. అప్పుడు చేసింది కరెక్టు అని చెప్పాలని.. ఆనాడు రెచ్చిపోయి.. ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వంశీ, అవినాష్‌ల గురించి సినిమా తీయాలని బుద్దా వెంకన్న డిమండ్ చేశారు. వర్మ సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందని.. ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటని జగన్ అంటున్నారని.. జగన్‌కు సిగ్గు ఉందా.. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ సినిమాల గురించి మాట్లాడతారా.. అంటూమండిపడ్డారు.
విజయవాడ: మాజీ సీఎం జగన్ (Ex CM Jagan), దర్శకుడు రాంగోపాల్ వర్మ (Director Ram Gopal Varma)లపై తీవ్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (TDP Leader Buddha Venkanna) మండిపడ్డారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. అనాడు విర్రవీగిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు భయపడి పారిపోయారని, జగన్ ప్రభుత్వం సహకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లను కించపరిచేలా సినిమాలు తీశారని విమర్శించారు. తన ట్విట్టర్లో మార్ఫింగ్ ఫొటోలు పెట్టి పైశాచిక ఆనందం పొందారని, ఇప్పుడు కేసులకు భయపడి అడ్రెస్ లేకుండా దాక్కున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.
రాంగోపాల్ వర్మకు దమ్ముంటే.. ధైర్యంగా నిలబడాలని.. అప్పుడు చేసింది కరెక్టు అని చెప్పాలని.. ఆనాడు రెచ్చిపోయి.. ఇప్పుడు దాక్కున్న వైసీపీ నేతలు కొడాలి నాని, వంశీ, అవినాష్‌ల గురించి సినిమా తీయాలని బుద్దా వెంకన్న డిమండ్ చేశారు. వర్మ సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిందని.. ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటని జగన్ అంటున్నారని.. జగన్‌కు సిగ్గు ఉందా.. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ సినిమాల గురించి మాట్లాడతారా.. అంటూ మండిపడ్డారు. భార్య, కూతుళ్లను వదిలేసిన వర్మను వెనుకేసుకొచ్చి మాట్లాడతారా.. జగన్ కూడా తల్లి, చెల్లిని బయటకు పంపేశారని తీవ్రస్థాయిలో బుద్దా వెంకన్న విమర్శించారు.
జగన్ వివేకం సినిమా గురించి ఎందుకు గగ్గోలు పెడుతున్నారని.. మరి ఆ సినిమా నిర్మాత, దర్శకుడిని ఎందుకు సన్మానించలేదని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.. వ్యూహం సినిమా తీసిన నిర్మాతను టీటీడీ బోర్డు సభ్యుడిని చేస్తారా.. చంద్రబాబును కించపరిచేందుకే ఇలాంటి చెత్త సినిమాలను వర్మతో జగన్ తీయించారని.. అందుకే ఇప్పుడు వర్మను కాపాడాలని సిగ్గు లేకుండా జగన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. జగన్ అసలు బాగోతం తెలిసి వైసీపీని వీడేందుకు ఆ పార్టీ నేతలు సిద్దంగా ఉన్నారని.. వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోవడం ఖాయమని.. కూటమి పార్టీల వైపు కీలక నేతలు చూస్తున్నారని బుద్దా వెంకన్న అన్నారు.
జగన్ అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని.. అలాంటివాళ్లను ఎవరూ ఇక నమ్మరని, తెలుగువారి పేరు చెబితే... ఎన్టీఆర్, చంద్రబాబులు చేసిన సంక్షేమం, అభివృద్ధి ప్రపంచ దేశాల్లో గుర్తుకు వస్తుందని బుద్దా వెంకన్న అన్నారు. అదే జగన్ పేరు చెబితే.. అవినీతి, అరాచకాలకు బ్రాండ్ అంబాసిడర్ అనే నానుడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ పరువు, ప్రతిష్టలను అమెరికాలో కూడా తీసేసిన చరిత్ర జగన్‌దని ఎద్దేవా చేశారు. ఇటీవల జగన్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే.. అతని మైండ్ కూడా సరిగా లేదనిపిస్తోందని ఎద్దేవా చేశారు. జగన్ ఆదేశాలతోనే.. వారి సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టారని, చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా వదలకుండా పోస్టులు పెట్టారని ఆరోపించారు. వర్మ పెట్టిన పోస్టులు కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చాయని ఆక్షేపించారు. ఇది నిజమని తాము అంటున్నామని.. ‘రాంగోపాల్ వర్మకు దమ్ముంటే నేనే సొంతంగా పోస్టులు పెట్టానని చెప్పాలి. మీకు లాగా కేసులకు భయపడి పారిపోయే వ్యక్తులం కాదు’ అంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు.
గత ఐదేళ్లుగా వైఎస్సార్‌సీపీ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొని తాము ఎన్నో పోరాటాలు చేశామని బుద్దా వెంకన్న అన్నారు. ఇప్పుడు కేసులు పెట్టగానే.. తలో దిక్కు పారిపోయి.. దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. తాము చంద్రబాబు కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉంటామని, మీకు ధైర్యం ఉంటే ఇప్పుడు రావాలని ఆయన సవాల్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు వాగిన వారు.. ఇప్పుడు ఎక్కడ అని ప్రశ్నించారు. ఒకప్పుడు గ్రేట్ డైరెక్టర్‌గా ఉన్న రాంగోపాల్ వర్మ.. జగన్ పంచన చేరగానే.. చీఫ్ డైరెక్టర్‌గా మారారని అన్నారు. ఎవరైనా సీఎం చంద్రబాబు జోలికి అన్యాయంగా వస్తే.. వారు నాశనం అవడం ఖాయమన్నారు. ఆర్ధికంగా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ది చేయడంపై ముఖ్యమంత్రి దృష్టి సారించారని, ఈ అభివృద్దిని అడ్డుకోవాలనే.. వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబుకు ఉన్న ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని జగన్ చూస్తున్నారని, వివేకానందరెడ్డిని ఎవరు చంపారో షర్మిల, సునీతారెడ్డి ఇప్పటికే చెప్పారన్నారు. వైఎస్సార్‌సీపీ టైటానిక్ షిప్ లాంటిందని, తప్పకుండా మునిగిపోవడం ఖాయమని అన్నారు. వైఎస్సార్‌సీపీలో జగన్ తప్ప అందరూ వెళ్లిపోతారని జోష్యం చెప్పారు. బాలినేని వంటి నాయకులు కూడా జగన్‌ను ఛీ కొడుతున్నారని, జగన్ ఇప్పటికైనా చేసిన తప్పులు ఒప్పుకుని లెంపలేసుకోవాలని బుద్దా వెంకన్న సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాగజ్‌నగర్, సర్పూర్ టీ మండలాల్లో 144 సెక్షన్
సస్పెండైన ఏఈఈ నిఖేష్ కుమార్ బాగోతం..
అవినాష్ రెడ్డి బాధితుడికి కూటమి ప్రభుత్వం న్యాయం..
స్టెల్లా షిప్‌కు నో డ్యూ సర్టిఫికెట్‌కు నిరాకరణ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 01 , 2024 | 02:50 PM