ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: ఆరా మస్తాన్‌ది బెట్టింగ్‌ల కోసం జగన్ అండ్ కో చేసిన ఫేక్ సర్వే..: బుద్దా వెంకన్న

ABN, Publish Date - Jun 06 , 2024 | 01:12 PM

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించి ప్రజల తీర్పు ఎలా ఉందో చూశారని.. ఈ ఎన్నికల్లో ఆరా మస్తాన్ సర్వే ఏమైందో చూశారని.. ఆరా మస్తాన్‌ది కేవలం బెట్టింగ్‌ల కోసం జగన్ అండ్ కో చేసిన ఫేక్ సర్వే అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఎన్నికలకు సంబంధించి ప్రజల తీర్పు (People Judgment ) ఎలా ఉందో చూశారని.. ఈ ఎన్నికల్లో ఆరా మస్తాన్ (Ara Mastan) సర్వే (Survey) ఏమైందో చూశారని.. ఆరా మస్తాన్‌ది కేవలం బెట్టింగ్‌ల (Betting) కోసం జగన్ అండ్ కో (Jagan and Co) చేసిన ఫేక్ సర్వే (Fake Survey)అని టీడీపీ సీనియర్ నేత (TDP Senior Leader), మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న (Buddha Venkanna) అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విజయవాడ (Vijayawada)లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా వేదిక కూల్చిన దగ్గర నుంచి టీడీపీపై పెట్రేగిపోయిన వైసీపీ నాయకులను (YCP Leaders), వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళ కార్యకర్తలే తరిమికొట్టారన్నారు. చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు.


చంద్రబాబుని అసెంబ్లీలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫినిష్ చేస్తానని అన్నారు.. కానీ భగవంతుడు వైఎస్‌ను లేకుండా చేశాడని బుద్దా వెంకన్న అన్నారు. జగన్ కూడా చంద్రబాబుపై అనేక వ్యాఖ్యలు చేశారని, కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దేవుడు చేశాడన్నారు. చంద్రబాబు కుటుంబం రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని, ఈరోజు కేంద్రంలో కూడా చంద్రబాబు కీ రోల్ పోషిస్తున్నారంటే మాకు అంతకంటే ఆనందం లేదన్నారు. పవన్‌ను మూడు పెళ్లిళ్లు అని జగన్ విమర్శించారని, కానీ ఇప్పుడు జగన్‌కు రంకుమొగుడు అయి కూర్చున్నారని.. అదీ పవన్ కళ్యాణ్ అంటే.. అంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు.


జగన్, కేటీఆర్ ఇద్దరూ కలిసి పోటీ చేసినా లోకేష్‌కు వచ్చిన మెజార్టీ రాలేదని, మంగళగిరి నియోజకవర్గంలో బీసీలంతా లోకేష్‌కు బ్రహ్మరథం పట్టారని బుద్దా వెంకన్న అన్నారు. జగన్ బీసీల వ్యతిరేకి అని, జగన్ ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిందేనని, మిగిలిన జీవితంతా జైల్లో గడపాల్సిందేనని అన్నారు. జగన్ మూడు జన్మలెత్తినా సరే తరగని శిక్షలు పడతాయన్నారు. కాగా చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించిన కృష్ణా జిల్లాలో ఉన్న పిచ్చి కుక్కల్ని మాత్రం వదిలేది లేదన్నారు. త్వరలోనే సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకు వెళ్తారని, 2024 జూన్ 4 న తెలుగుదేశం పార్ట్ 2 వచ్చిందని, ఇప్పటి వరకూ ఉన్నది పార్ట్ 1.. ఇంకో 45 సంవత్సరాలు టీడీపీకి తిరుగు లేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు నివాసానికి వచ్చిన మాజీ డి.జీ. ఏబీ వెంకటేశ్వరరావు

హైదరాబాద్: ముంచేసిన వరద దృశ్యాలు..

సీఎస్ సెలవుపై వెళ్లాలని సంకేతాలు..!

వైసీపీలో కలకలం

జగన్‌ను కలవని వైసీపీ ఎమ్మెల్యేలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 06 , 2024 | 01:48 PM

Advertising
Advertising