ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: నా శపధాన్ని ప్రజలు గౌరవించారు: చంద్రబాబు

ABN, Publish Date - Jun 11 , 2024 | 12:16 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలో అడుగుపెడతానని తాను చేసిన శపధాన్ని ప్రజలు గౌరవించారని.. ప్రజల గౌరవాన్ని నిలపెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దామని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రిగా (Chief Minister) మళ్లీ గౌరవ సభలో (Honorary Assembly) అడుగుపెడతానని తాను చేసిన శపధాన్ని ప్రజలు గౌరవించారని.. ప్రజల గౌరవాన్ని నిలపెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దామని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం విజయవాడలో కూటమి సమావేశంలో (Kutami Meeting) ఆయన మాట్లాడుతూ.. పోలవరం (Polavaram) పూర్తితో పాటు నదుల అనుసంధానం చేస్తే ప్రతీ ఏకరాకు నీరివ్వొచ్చునని, పోలవరం పూర్తి చేసే దిశగా ప్రతీ ఒక్కరం కృషి చేద్దామన్నారు. అమరావతి (Amaravati) రాష్ట్ర రాజధాని అని, విశాఖ (Visakha)ను ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేద్దామన్నారు. ప్రజావేదికలా విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలన్నారు.


జగన్ చెప్పిన విశాఖ రాజధాని ప్రతిపాదనలు అక్కడి ప్రజలు నమ్మలేదని, విశాఖ అభివృద్ధి మాత్రం మేం మర్చిపోమని చంద్రబాబు అన్నారు. విశాఖ న్యాయ రాజధాని అంటూ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించారన్నారు. కర్నూలు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.


సీఎం కూడా మామూలు మనిషేనని, ముఖ్యమంత్రి వస్తున్నారంటే.. పరదాలు కట్టటం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపి వేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండవని చంద్రబాబు అన్నారు. తన కాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు కానీ ట్రాఫిక్ నిబంధనలు పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. తనకు ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు..తన కోసం ట్రాఫిక్‌ను ఆపి ప్రజలను మాత్రం ఇబ్బందులు పెట్టొద్దు అంటూ మరోసారి చంద్రబాబు పోలీసులకు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గొర్రెల స్కామ్.. 2వ రోజు కస్టడీ విచారణ..

జేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన పురందేశ్వరి

వైసీపీతో అంటకాగిన విశాఖ అధికారుల టెన్షన్..

ఐదేళ్లలో గనుల శాఖలో భారీ అవినీతి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 11 , 2024 | 12:19 PM

Advertising
Advertising