ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP HighCourt: సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్‌కు హైకోర్టులో చుక్కెదురు..

ABN, Publish Date - Aug 09 , 2024 | 01:07 PM

Andhrapradesh: ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై దాడి కేసులో పరారీలో ఉన్న సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్‌ కోసం విజయపాల్ కోర్టులో పిటిషన్‌ వేయగా.. ఈరోజు విచారణకు వచ్చింది. అయితే విజయపాల్‌కు ముందుస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టుకు నిరాకరించింది.

AP High Court

అమరావతి, ఆగస్టు 9: ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై (Undi MLA Raghuramakrishnamraju) దాడి కేసులో పరారీలో ఉన్న సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్‌కు హైకోర్టులో (AP HighCourt) చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్‌ కోసం విజయపాల్ కోర్టులో పిటిషన్‌ వేయగా.. ఈరోజు విచారణకు వచ్చింది. అయితే విజయపాల్‌కు ముందుస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టుకు నిరాకరించింది. తదుపరి విచారణను ఈనెల 20కి ధర్మాసనం వాయిదా వేసింది. ఎమ్మెల్యే రఘురామ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నగరంపాలెం పోలీసులు నమోదు చేశారు. రఘురామకు కస్ట్టోడియల్ టార్చర్‌లో గాయాలైనట్లు గతంలో సుప్రీంకోర్టు అభిప్రాయ పడిందనే వాదనను పరిగణంలోకి తీసుకొన్న హైకోర్ట్.. మధ్యంతర ముందస్తు బయిల్ ఇవ్వటానికి నిరాకరించింది.

Gujarat Model: చికాగోలో టీచర్ గారు.. జీతం మాత్రం గుజరాత్‌లో..


గత నెలలో గుంటూరులోని ఎస్పీ కార్యాలయానికి వచ్చిన రఘురామ.. ఎస్పీ సతీశ్ కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారులపై కేసు నమోదైనందున వారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని కోరారు. ‘‘గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో నన్ను హత్యచేసి గుండెపోటుగా చిత్రీకరించాలనే కుట్ర జరిగింది. దానికి సంబంధించి ఈ నెల 13న గుంటూరు, నగరంపాలెం పోలీస్‌ స్టషన్‌లో హత్యాయత్నం, కుట్ర కేసు నమోదయ్యాయి. సీఐడీ చీఫ్‌, అదనపు డీజీ పీవీ సునీల్‌ కుమార్‌, ఇంటెలిజెన్స్‌ డీజీపీ సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, సీఐడీ అదనపు ఎస్పీ కే విజయపాల్‌, నాటి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ జి.ప్రభావతి తదితరులను నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే.

Manish Sisodiya: మనీష్ సిసోడియాకు భారీ ఊరట..


‘‘నా వద్ద ఉన్న ఆధారాలను ఎస్పీకి అందజేసి, కేసు దర్యాప్తు పురోగతి తెలుసుకునేందుకే వచ్చా. నాటి కుట్రలో అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్‌ పాత్ర కూడా ఉంది. ఆనాటి జీజీహెచ్‌ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ శ్రీకాంత్‌ను అందుబాటులో ఉండాలంటూ కలెక్టర్‌ ఎందుకు లేఖ రాశారో తేలాలి. నన్ను హత్య చేసందుకు నేరపూరిత కూట్ర జరిగిందనడానికి ఆధారాలను ఎస్పీకి అందించా. ఈ కేసులో త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిందితులను శిక్షించాలని కోరాను. ఈ కేసులో నలుగురు అధికారులు ఉంటే వారిని ఎందుకు సస్పెండ్‌ చేయలేదో నాకు అర్థం కావడం లేదు’’ అని ఎమ్మెల్యే అన్నారు.


ఇవి కూడా చదవండి..

Duvvada: బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. తుపాకీకి లైసెన్స్ ఇవ్వండి

Sandhyarani: గిరిజనుల అభివృద్ధి కోసమే ఎన్టీఆర్ ఐటీడీఏను స్థాపించారు..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 09 , 2024 | 01:33 PM

Advertising
Advertising
<