ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: వైసీపీ నేతలు చేసినట్లు చేయవద్దని పదే పదే చెప్తున్నా...

ABN, Publish Date - Aug 07 , 2024 | 04:35 PM

Andhrapradesh: ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసిన అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మద్యం తయారీకి 16శాతం ఖర్చు అవుతుంటే, 84శాతం ఆదాయం తమ జేబుల్లోకి వచ్చేలా అమ్మకాలు జరిపారని మండిపడ్డారు. ఆదాయం ప్రభుత్వానికి రాకుండా వైసీపీ నేతలు దోచేశారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి నాసిరకం బ్రాండ్లు తెచ్చారన్నారు.

CM Chandrababu Naidu

అమరావతి, ఆగస్టు 7: ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసిన అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మాట్లాడుతూ.. మద్యం తయారీకి 16 శాతం ఖర్చు అవుతుంటే, 84 శాతం ఆదాయం తమ జేబుల్లోకి వచ్చేలా అమ్మకాలు జరిపారని మండిపడ్డారు. ఆదాయం ప్రభుత్వానికి రాకుండా వైసీపీ నేతలు దోచేశారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి నాసిరకం బ్రాండ్లు తెచ్చారన్నారు. 2014 - 2019 మధ్య అన్ని బ్రాండ్ల్ అందుబాటులో ఉంచామన్నారు. నేతల జేబులు నింపుకునేందుకే ఎక్కడా డిజిటల్ పేమెంట్లు చేయలేదన్నారు.

AP Cabinet: ముగ్గురు పిల్లలు ఉన్నవారు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యొచ్చు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు


రాష్ట్రంలో అక్టోబర్1 నాటికి ఉత్తమమైన మద్యం విధానం అందుబాటులోకి తీసుకొద్దామని సీఎం అన్నారు. ఈలోపు యూపీ, తెలంగాణ, కర్ణాటక, , రాజస్థాన్, కేరళ తదితర రాష్ట్రాల్లో మద్యం విధానాలు అధ్యయనం చేసి ఉత్తమమైనది రూపొందించాలని.. ఇందుకు మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేద్దామని అన్నారు. రీ సర్వే వివాదాలు మూడు నెలల్లో పరిష్కరించేందుకు గ్రామసభలు నిర్వహిద్దామన్నారు. రీ సర్వే కు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న వాటిని కూడా అధ్యయనం చేయాలని మంత్రులకు సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూ సంబంధించినవే ఉన్నాయన్నారు. భూముల రీ సర్వే పేరుతో గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. సర్వే రాళ్లపై పేర్లు, బొమ్మలు తుడిచేసి ప్రభుత్వ అవసరాలకు వినియోగిద్దామన్నారు. నదుల అనుసంధానం, సాగు తాగుకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేద్దామన్నారు. నీటిని సద్వినియోగం చేసుకుని చెరువులు నింపుకునేలా మంచి ప్రణాళికలు రూపొందిద్దామని చెప్పారు.

AP News: మాజీ మంత్రి పెద్దిరెడ్డి తీరుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యంగ్యాస్త్రాలు


రానున్న రోజుల్లో కరవు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి వినియోగ చర్యలు చేపడతామన్నారు. నదుల అనుసంధానానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. ఇందుకనుగుణంగా ప్రజలతో మమేకమవుతూ జలహారతుల కార్యక్రమాలు నిర్వహిద్దామని వెల్లడించారు. అవసరాలకు తగ్గట్టుగా ఉద్యోగుల బదిలీలు చేద్దామన్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు చేసినట్లు చేయవద్దని పదే పదే చెప్తున్నానని.. వీలైనంతలో ప్రొఫైల్‌లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వైసీపీ చేసిన అరాచకాలపై కోపం కసి ఉన్నా చట్టపరంగానే వెళదామని చెప్పారు. చేయని తప్పుకు అక్రమ కేసుల్లో అరెస్ట్ అయి జైలుకెళ్లిన బాధితుల్లో తానూ ఉన్నానని గుర్తించాలన్నారు. ఏపీ ఎన్నికల్లో జరిగింది నిశబ్ద విప్లవమైతే ...బంగ్లాదేశ్‌లో వైలెంట్ విప్లవం చూశామన్నారు. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఓటు రూపంలో ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. బంగ్లాదేశ్‌లో ప్రజా తిరుగుబాటు ఫలితం చూశామన్నారు. నియోజకవర్గాల అభివృద్ధిపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజల మధ్యే చర్చ పెట్టి, వారి అభిప్రాయాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలని కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు.


ఇవి కూడా చదవండి...

Jagan: సెక్యూరిటీ పునరుద్దరణపై హైకోర్టులో జగన్ పిటిషన్.. మధ్యాహ్నానికి వాయిదా

Parthasarathi: ఏపీలో జనాభా సంఖ్య తగ్గిపోతోంది.. పెరుగుదుల అవసరం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 07 , 2024 | 04:39 PM

Advertising
Advertising
<