CM Chandrababu: మంత్రి కొల్లు రవీంద్ర సోదరుని మృతికి సీఎం చంద్రబాబు సంతాపం
ABN, Publish Date - Dec 12 , 2024 | 08:13 AM
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం చోటు చేసుకుంది. మంత్రి సోదరుడు కొల్లు వెంకటరమణ(64)కు బుధవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
అమరావతి: ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి కొల్లు రవీంద్ర (AP Excise Minister Kollu Ravindra) సోదరుడు (Brother) వెంకటరమణ (Venkataramana) హఠాన్మరణం (Death)పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటరమణ మృతికి సంతాపం (Condoles) తెలిపారు. మంత్రి రవీంద్ర కుటుంబంలో ఇది తీవ్ర విషాదమని పేర్కొన్నారు. వెంకటరమణ ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం చోటు చేసుకుంది. మంత్రి సోదరుడు కొల్లు వెంకటరమణ(64)కు బుధవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన బందురులోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అక్కడి నుంచి పార్థివదేహాన్ని ఇంటికి తరలించారు. కాగా సోదరుడి మరణవార్త తెలుసుకున్న మంత్రి రవీంద్ర విజయవాడలోని కలెక్టర్ల సమావేశం నుంచి హుటాహుటిన మచిలీపట్నం బయలుదేరారు. విషయం తెలుసుకున్న పలువురు కూటమి నాయకులు మంత్రి కొల్లు రవీంద్రను పరామర్శించారు. కాగా కొల్లు వెంకటరమణ వ్యాపారవేత్త. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకట రమణ అంత్యక్రియలు గురువారం ఉదయం జరుగుతాయని తెలియవచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జనం మెచ్చేలా! మనం నచ్చేలా పాలన
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 12 , 2024 | 08:13 AM