ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IdhiManchiPrabhutvam: 100 రోజులు పూర్తి.. నేటి నుంచి 26 వరకు ప్రజల్లోకి...

ABN, Publish Date - Sep 20 , 2024 | 12:09 PM

Andhrapradesh: నిత్యం పరదాల మాటున కాకుండా ప్రజల్లోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ఉన్నారు. 100 రోజుల పాలనకు గుర్తుగా ఈరోజు నుంచి ఈ నెల 26 వతేది దాకా ' ఇది మంచి ప్రభుత్వం ' పేరుతో ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు వెళ్లనున్నారు.

AP Government

అమరావతి, సెప్టెంబర్ 20: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుని అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనకు నేటితో వంద రోజులు పూర్తి అయ్యాయి. ఈ వంద రోజుల పాలనలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కొటిగా నెరవేర్చేందుకు కృషి చేసింది సర్కార్. ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ఈ కొద్దిరోజుల్లోనే ప్రభుత్వం చేపట్టింది. అభివృద్ధి.. సంక్షేమం కార్యక్రమాల మధ్య సమతూకం పాటిస్తూ సర్కార్ దూసుకెళ్తోంది. నిత్యం పరదాల మాటున కాకుండా ప్రజల్లోనే సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు (Deputy CM Pawan Kalyan) ఉన్నారు.

Tirumala laddu: తిరుమల లడ్డూ వ్యవహారం... జగన్‌పై కేంద్రహోంశాఖకు ఫిర్యాదు


100 రోజుల పాలనకు గుర్తుగా ఈరోజు (శుక్రవారం) నుంచి ఈ నెల 26 వతేది దాకా ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ పేరుతో ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు వెళ్లనున్నారు. ప్రకాశం జిల్లా చదలవాడ గ్రామంలో జరిగే ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజల వద్దకు జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు వెళ్లనున్నారు. ఈ నెల 26 వరకు పాల్గొనేలా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి నేటి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. గ్రామ, వార్డు సభలు నిర్వహించి వంద రోజుల పాలనపై అవగాహన కలించేలా విస్తృత కార్యక్రమాలు నిర్వహించేలా కూటమి సర్కార్ ప్రణాళికులు రూపొందించింది.


తొలి వంద రోజుల్లోనే..

కాగా.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల వ్యవధిలోనే కూటమి సర్కార్ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు సాధించడం ద్వారా రాజధాని వంటి కొన్ని కీలక కార్యక్రమాలు పూర్తి కాగలవన్న నమ్మకాన్నికలిగించగలిగింది. అగాథంలో కూరుకుపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ప్రయత్నం చేస్తూనే, సామాన్యులు, బాధితులకు ఉన్నంతలో ఉపశమనం కలిగించడానికి చంద్రబాబు ప్రభుత్వం తొలి వంద రోజుల్లో గట్టి ప్రయత్నం చేసింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే పేదల ఫించన్‌ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి రూ. నాలుగు వేలు చేశారు. అంతేకాకుండా మూడు నెలల బకాయి కలిపి ఒకేసారి రూ. ఏడు వేలు అందజేసింది.

Viral Video: ఐఫోన్ 16 కోసం 20 గంటలు లైన్లో వేచిఉన్న ప్రజలు



వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు మొదటి తేదీన జీతాలు తీసుకోవడం అనేది అసాధ్యమే.. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక.. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలాకాలం తర్వాత మొదటి తేదీనే జీతాలు అందడం మొదలైంది. అధికారంలోకి వచ్చిన రెండో నెలలో కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పునర్‌ ప్రారంభించి పేదవాడి ఆకలిని తీర్చింది. అంతకంటే ముఖ్యంగా ఇటీవల విజయవాడను భారీ వరదలు ముంచెత్తాయి. వరద సమయంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తీరు ఎంతో గొప్పదని చెప్పుకొవచ్చు. ఒక సామాన్యుడి లాగే సీఎం చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరదల్లో సర్వం తానై పనిచేశారు. పది రోజుల పాటు బస్సులోనే ఉంటూ వరద బాధితులకు నేనున్నాంటూ భరోసా కల్పిస్తూ ప్రజల మన్ననలు పొందారు సీఎం చంద్రబాబు.


ఇవి కూడా చదవండి..

Jani Master: నార్సింగ్ పోలీస్ స్టేషన్‌‌లోనే జానీ మాస్టర్.. మరి కొద్దిసేపట్లో..

Tirumala laddu: తిరుమల లడ్డూ వ్యవహారం... జగన్‌పై కేంద్రహోంశాఖకు ఫిర్యాదు

Read LatestAP NewsANdTelugu News

Updated Date - Sep 20 , 2024 | 12:28 PM