ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఏపీలో స్మగ్లర్లు లేకుండా చేస్తాం.. సీఎం చంద్రబాబు హెచ్చరిక..

ABN, Publish Date - Dec 20 , 2024 | 07:40 PM

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు రైతు సేవా కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ మొదలు మిల్లులకు ఎగుమతి చేసే ప్రక్రియ మొత్తాన్నీ ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

అమరావతి: రైతుల వద్ద ధాన్యం సేకరణ విషయంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఐవీఆర్‌ఎఫ్‌ ద్వారా రైతుల నుంచి తానే స్వయంగా అభిప్రాయాలు సేకరిస్తానని చంద్రబాబు చెప్పారు. అధికారుల నుంచి తనకు కావాల్సింది డాక్యుమెంటేషన్‌ కాదని, రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్‌మెంట్‌ కనిపించాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు రైతు సేవా కేంద్రాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ మొదలు మిల్లులకు ఎగుమతి చేసే ప్రక్రియ మొత్తాన్నీ ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.


తేమశాతంపై ఆరా..

ధాన్యం తేమ శాతం నమోదు, ఇతరత్రా అంశాల్లో ఎగుమతి, దిగుమతి దగ్గర ఒకేలాంటి కచ్చితత్వం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తూకంలో హెచ్చుతగ్గులు, తేమ శాతంలో లొసుగులు వంటి అంశాలను ఆయన స్వయంగా పరిశీలించారు. తేమశాతంలో ఎందుకు మార్పులు వస్తున్నాయంటూ అధికారులను సీఎం ప్రశ్నించారు. తేమ శాతం నిర్ధారణ చేసే మిషన్‌ పనితనాన్ని పరిశీలించారు. రైతులకు ఐవీఆర్‌ఎస్‌పై సీఎం అవగాహన కల్పించారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు తనకు ఫీడ్‌ బ్యాక్‌ పంపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ధాన్యం సేకరణ విషయంలో ఎక్కడ తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గంగూరు రైతులతో మాట్లాడి వారి నుంచి పలు అభిప్రాయాలను చంద్రబాబు తెలుసుకున్నారు.


ఆ సమస్య వారి పొరపాటే..

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "ధాన్యం దిగుబడిలో మెకనైజేషన్ పెంచి రైతుల ఆదాయం మెరుగుపడేలా చర్యలు తీసుకుంటాం. దిగుబడి పెరిగి డబ్బు సకాలంలో చేతికొస్తుండటంతో రైతులు గతేడాది కంటే ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ధాన్యం తేమ శాతం నిర్ధారణలో లోటుపాట్లు గుర్తించాం. రైతు సేవా కేంద్రాల్లో తేమ శాతం ఒకలా ఉంటే మిల్లర్ల వద్ద మెషీన్లలో మరోలా ఉంటోంది. ఈ వ్యత్యాసం లేకుండా రెండు చోట్లా ఒకేలా మెషీన్ వాల్యూ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. గోనె సంచుల సమస్య రైస్ మిల్లర్ల పొరపాటు వల్ల తలెత్తుతోందని గుర్తించాం. ధాన్యం డబ్బులు 93 శాతం రైతులకు 24 గంటల్లో చెల్లిస్తున్నాం. దీన్ని ఇంకా మెరుగ్గా అమలు చేసేందుకు సూచనలిచ్చా. డ్రయర్ల దగ్గర కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత డ్రయర్లు 23 శాతం కెపాసిటీతో మాత్రమే ఉన్నాయి.


ఇకపై సడన్ విజిట్స్..

ధాన్యం సేకరణ కేంద్రానికి ఇవాళ చెప్పి వచ్చినట్లు ఇకపై చెప్పి రాను. ఆకస్మిక తనిఖీలతో సడన్ విజిట్స్ పెంచుతా. సాంకేతికత సక్రమ వినియోగంతో రైతుల ఖర్చు తగ్గించి ఎక్కువ లాభం వచ్చేలా చేస్తాం. ఎలాంటి పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందనే అంశంపై వారికి అవగాహన కల్పిస్తాం. లాభసాటి వ్యవసాయంపై రైతుల భాగస్వామ్యంతో పెద్దఎత్తున చర్చలు చేపడతాం. ఐవీఆర్ఎస్ ఫిర్యాదుల్లో చెప్పినట్లే గోనె సంచుల సమస్య తీవ్రంగా ఉంది. దళారీ ముసుగులో రైతులకు ఎవరు అన్యాయం చేయాలని చూసినా ఉపేక్షించను. రాష్ట్రంలో స్మగ్లింగ్‌కి చోటు లేదు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బియ్యం అక్రమ రవాణాను అరికట్టి తీరుతాం. బియ్యం స్మగ్లింగ్, రీసైక్లింగ్ విషయంలో కఠినంగా ఉంటామని" అన్నారు.


ఈ వార్త కూడా చదవండి:

Mummidivaram: పాము రాళ్ల పేరుతో రైతులను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..

CM Chandrababu: వారి తాట తీస్తాం.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్..

Updated Date - Dec 20 , 2024 | 07:41 PM