ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: తెలుగుగింటి ఆడపడుచులకు సీఎం చంద్రబాబు రాఖీ శుభాకాంక్షలు

ABN, Publish Date - Aug 19 , 2024 | 09:17 AM

Andhrapradesh: రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకున్ని తెలుగింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. ‘‘నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు’’ అని తెలిపారు.

CM Chandrababu Naidu

అమరావతి, ఆగస్టు 19: రాఖీ పర్వదినాన్ని (Rakhi Festival) పురస్కరించుకున్ని తెలుగింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. ‘‘నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు’’ అని తెలిపారు.

CM Chandrababu : నేడు 15 పరిశ్రమలు ప్రారంభం


తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి అని చెప్పుకొచ్చారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళామతల్లుల పేరు పైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే అని అన్నారు. మహిళా సాధికారత కోసం ‘డ్వాక్రా’ సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం కృషిచేశామన్నారు. ‘‘ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటిస్తూ... ఈ ‘రక్షాబంధన్’ సమయంలో మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అన్నివేళలా, అన్నివిధాల అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Raksha Bandhan: మీ సోదరుడికి రాఖీ కడుతున్నారా.. ఈ విషయలు తప్పక తెలుసుకోండి..



నెల్లూరులో పర్యటన

మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సోమశిల ప్రాజెక్ట్‌ను సీఎం పరిశీలించనున్నారు. స్పిల్వే, ఆప్రాన్, దెబ్బతిన్న రక్షణ కట్టడాలను చంద్రబాబు పరిశీలిస్తారు. సోమశిల గ్రామంలో ప్రజలతో, ఇరిగేషన్ అధికారులతో ప్రజావేదికలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన ప్రాంతాల్లో భద్రతను, బంధోబస్తుకు జిల్లా ఎస్పీ, కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేశారు.


డిప్యూటీ సీఎం విషెస్..

అలాగే రక్షాబంధన్‌ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ మహిళాలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ పండుగ అని అన్నారు. కుటుంబ బాంధవ్యాలకు అధిక ప్రాధాన్యమిచ్చే మన భారతీయులకు శ్రావణ పౌర్ణమినాడు వచ్చే ఈ రాఖీ పండుగ ఒక ఆనందాల వేడుక అని వెల్లడించారు. ఈ పర్వదినం సందర్భంగా అక్కాచెల్లెళ్లు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Visakhapatnam : నైరుతి..తీరు మారింది

Gandipet Lake: బడా భవనాలపైకి బుల్డోజర్‌..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 19 , 2024 | 09:32 AM

Advertising
Advertising
<