ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

ABN, Publish Date - Aug 21 , 2024 | 12:48 PM

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వివిధ శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. హోంశాఖ, రవాణ, యువజన సర్వీసుల శాఖలపై ఆయన సమీక్షిస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని శాంతి భద్రతలు, మహిళల రక్షణపై చర్చలు జరుపుతారు. ఆస్పత్రులలో గొడవలు జరగకుండా తీసుకోవాల్సిన ప్రత్యేక భద్రతపై సీఎం సమీక్ష జరుపుతారు.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) బుధవారం వివిధ శాఖలపై సమీక్ష (Review of various Branches) నిర్వహిస్తున్నారు. హోంశాఖ, రవాణ, యువజన సర్వీసుల శాఖలపై ఆయన సమీక్షిస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని శాంతి భద్రతలు, మహిళల రక్షణపై చర్చలు జరుపుతారు. ఆస్పత్రులలో గొడవలు జరగకుండా తీసుకోవాల్సిన ప్రత్యేక భద్రతపై సీఎం సమీక్ష జరుపుతారు. గంజాయి నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్(AP ANTF) బలోపేతంపై కూడా చంద్రబాబు సమీక్షిస్తారు.


అలాగే రాష్ట్రంలో ఇసుక పాలసీ అమలు, ఇసుక లభ్యత, ఇసుక రవాణ ఛార్జీల నియంత్రణపై సీఎం చంద్రబాబు కసరత్తు చేయనున్నారు. రవాణ శాఖపైనా ఆయన సమీక్షిస్తారు. అదనంగా 2 వేల బస్సులు, 3,500 మంది డ్రైవర్ల నియామకంపై చర్చలు జరిపుతారు. రాష్ట్రాల సరిహద్దుల్లో రవాణ శాఖ చెక్ పోస్టుల ఏర్పాటు చేయాలా..? వద్దా..? అనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.


హోంశాఖపై చంద్రబాబు సమీక్ష..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోంశాఖపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సమావేశానికి హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2014-19తో పోల్చితే 2019-24 మధ్య క్రైం రేటు 46. 8 శాతం పెరిగిందని అధికారులు వివరించారు. మహిళలపై నేరాలు 36 శాతం, పిల్లలపై క్రైం 152 శాతం, మిస్సింగ్ కేసులు 84 శాతం, సైబర్ క్రైం నేరాలు 134 శాతం పెరిగాయని వివరించారు. గంజాయి, డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైంకు అడ్డుకట్ట వేయాలని, టెక్నాలజీ వాడకం, పోలీసు శాఖ బలోపేతం వంటి అంశాలపై రివ్యూలో చర్చించారు.


కాగా ఎన్నికల ముందు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై చంద్రాబాబు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. త్వరలో రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దీనిపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అదనంగా 2 వేల బస్సులు.. 3500 మంది డ్రైవర్ల నియామకంపై చర్చలు జరగనున్నాయి.


కాగా ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వస్తే.. రద్దీ పెరుగుతుంది.. ఈ నేపథ్యంలో అదనంగా బస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని, ఖాళీలున్న డ్రైవర్‌ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు ఇప్పటికే నివేదిక సిద్ధం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండగా.. వాటిలో సొంత బస్సులు 8,220 కాగా.. మిగిలినవి అద్దె బస్సులు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలువస్తే.. మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా కనీసం 2 వేల కొత్త బస్సులు అవసరమవుతాయని అధికారులు అంచనావేశారు. ఈ పథకంతో రాష్ట్రంలో ఆర్టీసీకి ప్రతి నెల సుమారు రూ. 250 కోట్ల ఆదాయం తగ్గే అవకాశముంది. ఈ నష్టాన్ని ప్రభుత్వం ప్రతినెలా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతినెలా వచ్చే ఆదాయంలో 25 శాతం ప్రభుత్వం తీసుకుంటోంది. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే.. ఆ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకపోగా.. తిరిగి అదనంగా నెలకు సుమారు రూ.125 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుందని అంచనా.. కాగా ఈరోజు జరుగుతున్న సమీక్షలో మహిళలకు ఉచిత ప్రయాణంపై సీఎం చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం దృశ్యాలు..

ఆ నిధులు వైఎస్ జగన్ ఏం చేశారు..?

నా ఉద్యోగం నాకివ్వండి: ప్రవీణ్ ప్రకాష్

కోల్‌కతా కేసుపై సుప్రీం కోర్టు సీరియస్..

సీఐడీ విచారణకు జోగి రమేష్ డుమ్మా ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 21 , 2024 | 12:48 PM

Advertising
Advertising
<