AP News: చంద్రబాబు ఫైలుపై సంతకం పెట్టిన కొన్నిగంటల్లోనే జీవో జారీ
ABN, Publish Date - Jun 14 , 2024 | 12:28 PM
అమరావతి: రాష్ట్రవ్యప్తంగా యువతలో నైపుణ్య గణన కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ఫైలుపై సంతకం పెట్టిన కొన్నిగంటల్లోనే సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి: రాష్ట్రవ్యప్తంగా యువతలో నైపుణ్య గణన కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆ ఫైలుపై సంతకం (Sign the file) పెట్టిన కొన్నిగంటల్లోనే సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ (CS Nirab Kumar Prasad) ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో స్కిల్ మ్యాన్ పవర్ (Skill man power) అవసరం పెరిగిందిదని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు. నైపుణ్యం కరువవడం వల్ల యువతకు ఉద్యోగావకాశలు దెబ్బతింటున్నాయి. 80 శాతం వరకూ ఉన్న యువతలోని నైపుణ్యంపై ప్రభుత్వాలకు, పరిశ్రమలకు అవగాహన లేదు.. పరిశ్రమల డిమాండు మేరకు యువతలో నైపుణ్యాలు కరువవుతున్నాయి.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, ఏఆర్, వీఆర్, బిగ్ డేటా, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ , ఐఓటి, రోబోటిక్స్ వంటి నైపుణ్యాలు యువతకు అందిచాలని, ఏపీలో ప్రతి ఏడు 4 లక్షల 40 వేలమంది విద్యార్ధులు టెక్నికల్ విద్యా సంస్ధల నుండి బయటకు వస్తున్నారు.. వీరందిరిలో ఉన్న నైపుణ్యంను లెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ చేయాలని నిర్ణయించింది. తద్వారా యువతలో ఎవరిలో ఎలాంటి స్కిల్ ఉంది గుర్తించడం, ఎవరికి ఎలాంటి స్కిల్ అవసరం అనే దాన్ని అంచనా వేడయం.. తద్వారా ఇండస్ట్రీ డిమాండ్ ఎలా ఉందో చూసి చర్యలు చేపట్టడం.. స్కిల్ సెన్సెస్ ద్వారా స్కిల్ గ్యాప్ స్టడీ సాధ్యం అవుతుందని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు.
స్కిల్ సెన్సెస్ ద్వారా ప్రభుత్వానికి పారిశ్రమిక రంగానికి మధ్య బ్రిడ్జ్ ఏర్పాటు అవుతుందని, అటు విద్యాసంస్ధలు ఎలాంటి కోర్సులు అవసరం, మార్కెట్‌లో ఎలాంటి డిమాండు ఉందానేదానిపై క్లారిటీ ఉంటుందని, స్కిల్ సెన్సెస్ నిర్వహణకు నోడల్ ఏజెన్సీగా ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పోరేషన్ వ్యవహరించనుంది. అన్ని విభాగాల అధిపతులు స్కిల్ సెన్సెస్‌కు పూర్తిస్ధాయిలో సహకరించాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జీ-7 సమ్మిట్‌కు హాజరైన ప్రధాని మోదీ.. ఇటలీలో బిజీ బిజీ..
గనుల శాఖలో రూ. 350 కోట్ల భారీ స్కాం..
హాట్ టాపిక్‌గా ఆదిమూలపు వ్యవహారం..
జగనన్న విద్యా కానుకపై చంద్రబాబు ఏమన్నారంటే..
టివి కేబుల్ ప్రాణాలను కాపాడింది: తెలుగు ప్రవాసీ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 14 , 2024 | 12:30 PM