CM Chandrababu: అంజిరెడ్డి పట్ల సీఎం చంద్రబాబు ఆసక్తి.. ఇంతకీ ఎవరీయన
ABN, Publish Date - Oct 26 , 2024 | 02:57 PM
Andhrapradesh: టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవుల జాప్యంపై పుంగనూరు అంజిరెడ్డి చేసిన ప్రసంగం సీఎంను ఆకట్టుకుంది. ఆయన మాటల పట్ల చంద్రబాబు ఆసక్తి కనబరిచారు.
అమరావతి, అక్టోబర్ 26: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఘనంగా ప్రారంభమైంది. 175 నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు తీసుకున్న కార్యకర్తలతో చంద్రబాబు నేరుగా మాట్లాడారు. అలాగే తెలంగాణ, అండమాన్ ప్రాంతాల నేతలు కూడా జూమ్ ద్వారా సభ్యత్వాలు నమోదు చేసుకున్నారు. వారితోనూ చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. ఆపై సభ్యత్వ నమోదు విధి విధానాల కరపత్రాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు.
TDP: టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
మాచర్లలో హత్యకు గురైన చంద్రయ్య కుటుంబసభ్యులు, పుంగనూరు అంజిరెడ్డితో సీఎం మాట్లాడారు. నామినేటెడ్ పదవుల జాప్యంపై అంజిరెడ్డి ప్రసంగం ఆకట్టుకుంది. 42 ఏళ్లుగా ఏ పదవీ ఆశించకుండా పార్టీకి సేవ చేస్తూ వచ్చానని అంజిరెడ్డి తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చాక తనకు పదవి ఇస్తానని చెప్పి, మూడు నెలలైనా ఇంత వరకు పదవి ఇవ్వకపోవడం బాలేదన్నారు. అయితే అంజిరెడ్డి మాటల పట్ల చంద్రబాబు ఎంతో ఆసక్తి కనబర్చారు. ఆశావహులు ఎక్కువగా ఉండటం వల్ల జాప్యం జరుగుతోందంటూ సీఎం సర్దిచెప్పారు. సరైన వారిని సరైన పదవిలో నియమిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ఇసుక సమస్య వల్ల తలెత్తుతున్న ఇబ్బందులు సీఎం దృష్టికి రంపచోడవరం కార్యకర్త తీసుకొచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఇసుకను పూర్తి ఉచితం చేసి, సులభతరం చేశామని చెప్పారు. ఇసుక దొరకని ప్రాంతాలకు ఇసుక లభించే ప్రాంతాల్లో ఉచితంగా తవ్వి తీసి పెడతామని వెల్లడించారు. కావాల్సిన వాళ్లు రవాణా ఛార్జీలు చెల్లించి తీసుకెళ్లవచ్చన్నారు. గత పాలకులు చేసిన అస్తవ్యస్త విధానాలను సరిచేసుకుంటూ రావటం వల్ల కొంత జాప్యం జరిగుతోందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పూర్తి అండగా ఉండి ఆదుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Jaggareddy: అవును.. వాళ్లను తిట్టాను.. తప్పేంటి
కార్యకర్తలకు పెద్దపీట
తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ విశ్వవిద్యాలయమని అన్నారు. నేటితరం చాలా మంది తెలుగు రాజకీయ నాయకుల మూలాలు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ పనిపోయిందన్న వాళ్ల పనైపోయింది కానీ పార్టీ శాశ్వతంగా ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వారసులుగా భవిష్యత్తుతరాలకు ఆ ఫలాలు అందించే బాధ్యత మనదన్నారు. తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత అన్నట్లుగా తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందన్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ పెద్దపీట వేస్తూ వారి మనోభావాలు గౌరవించే పార్టీ తెలుగుదేశం అని అన్నారు. యువతను ప్రోత్సహిస్తూ, పదవులు, అధికారాలు సామాన్యులకు, చదువుకున్న వారికి, అన్నివర్గాలకు అందించిన పార్టీ టీడీపీ అని.. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు దేశంలోనే తొలిసారి ప్రమాద భీమా ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశమన్నారు. ఈ వినూత్న ఆలోచనకు లోకేష్ శ్రీకారం చుట్టి ఎంతో పటిష్టం చేస్తూ వచ్చారన్నారు.
శాశ్వత సభ్యత్వం తీసుకునేందుకు ఇచ్చే రూ.లక్ష కూడా కార్యకర్తల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తామని తెలిపారు. చనిపోయిన కార్యకర్తల పిల్లలు చాలామందికి ఎలిమెంట్రీ స్కూల్ నుంచి పీజీ వరకూ ఉచితంగా చదివిస్తున్నామన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పటిష్ట యంత్రాంగం ఉన్న పార్టీ తెలుగుదేశమన్నారు. జాతీయ భావంతో ముందుకెళ్తూ ప్రతిభకు పెద్దపీట వేస్తామని చెప్పారు. జాతీయస్థాయిలో తెలుగుదేశం పోషించిన కీలకపాత్రలు మరే పార్టీకి సాధ్యంకాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Lokesh: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాకు లోకేష్.. అపూర్వ స్వాగతం
AP Govt: ధరల నియంత్రణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 26 , 2024 | 03:04 PM