ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: మంత్రుల్లో 18 మంది కొత్త వారే..

ABN, Publish Date - Oct 18 , 2024 | 01:51 PM

Andhrapradesh: ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం పట్ల రాష్ట్రం మొత్తం ఎందుకు ఆసక్తి కనబరుస్తోందో ప్రతీ ఒక్కరూ గ్రహించాలని ఈ సందర్భంగా సీఎం అన్నారు. చేసిన పనులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పార్టీ భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏ నమ్మకంతో ప్రజలు మనకు ఓటేశారో ఆ నమ్మకాన్ని అంతా నిలబెట్టుకోవాలని సూచించారు.

CM Chandrababu Naidu

అమరావతి, అక్టోబర్ 18: పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం ప్రజాప్రతినిధుల సమావేశం శుక్రవారం మొదలైంది. ఎన్టీఆర్ ప్రతిమకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఈ సమావేశం పట్ల రాష్ట్రం మొత్తం ఎందుకు ఆసక్తి కనబరుస్తుందో ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. చేసిన పనులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పార్టీ భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏ నమ్మకంతో ప్రజలు మనకు ఓటేశారో ఆ నమ్మకాన్ని అంతా నిలబెట్టుకోవాలని సూచించారు. ఐదేళ్లు తీవ్రంగా నష్టపోయి, కష్టనష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తల బాధను సమన్వయం చేసుకోవాలన్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా.. ఈ విధంగా అధికారులు సహా వ్యవస్థలన్నీ నాశనమైన పరిణామాలు గతంలో చూడలేదన్నారు.

Gurpatwant Singh Pannun: ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు కుట్రలో బిగ్ ట్విస్ట్.. భారత 'రా' అధికారిపై అమెరికా అభియోగాలు..


మళ్లీ రాష్ట్రం రావణ కాష్టమే..

వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించటం, పరిమిత వనరుల కారణంగా అన్నీ సరిచేయటానికి సమయం పడుతోందని తెలిపారు. ఏ శాఖలోనూ సరైన ఆడిట్ జరగలేదన్నారు. కేంద్ర నిధులను కూడా ఇష్టానుసారం మళ్లించేశారని మండిపడ్డారు. మనం ఇప్పుడు ప్రవర్తించే విధానం వల్లే వచ్చే ఎన్నికల ఫలితాలు, మెజారిటీ ఆధారపడి ఉంటాయన్నారు. ఎన్ని అరాచకాలు చేయకపోతే 151 సీట్లు వచ్చిన వైసీపీ 11కి పడిపోయిందో ప్రతీ ఒక్కరూ గ్రహించాలని అన్నారు. ‘‘మనమూ అదే తీరున వెళ్తే రాష్ట్రం మళ్లీ రావణ కాష్టమే.. తప్పు చేసిన వారిని వదిలి పెట్టకూడదు, అలాగని కక్షసాధింపులకు వెళ్లకూడదు... ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. సంఘటిత శక్తిగా పనిచేస్తేనే ప్రజల అంచనాలను అందుకోగలం. ఎన్డీఏలో ఎవ్వరు తప్పు చేసినా ఆ ప్రభావం ముఖ్యమంత్రి మీదే ఉంటుందని ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. నాయకుడికి విశ్వసనీయత రావాలంటే ఎంతో సమయం పట్టినా... చెడకొట్టుకోవాలనుకుంటే నిమిషం చాలు. నాతో సహా ఎవరికైనా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. తదుపరి ఎన్నికలకు సిద్ధమవుతున్నామనే సంకేతం ఇచ్చేందుకే నిన్న ప్రధాని ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో ఐదు గంటలు కూర్చున్నారు. ఇక్కడ మనమూ అదే సిద్ధాంతాన్ని అనుసరించాలి’’ అని స్పష్టం చేశారు.

Ani Master: జానీ మంచివారు...నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి



‘‘గత ఐదేళ్లు సాగిన అరాచకం కారణంగా నాతో సహా, ప్రజలు, నేతలు అంతా ఇబ్బంది పడ్డారు. గెలిచాం కాబట్టి ఇక మన పని అపోయిందనుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయని గుర్తించాలి. యువత, విద్యావవంతులు ఇలా దాదాపు 65 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. మంత్రుల్లో 18 మంది కొత్తవారే ఉన్నారు. ప్రతీ ఇంట్లోనూ చిన్నపాటి సమస్యలుండి సమన్వయం చేసుకున్నట్లే... కుటుంబం లాంటి పార్టీలోనూ ఉండటం సహజం’’ అని చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.


ఆ 6 పాలసీలతో గేమ్ ఛేంజర్..

ఇసుక, మద్యం విధానాల్లో వైసీపీ చేసిన తప్పే పార్టీ నాయకులూ చేస్తానంటే ఊరుకోనని హెచ్చరించారు. ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి వస్తే పార్టీకి, నేతలకూ ఇబ్బందే అని అన్నారు. ఇసుక, మద్యం అంశాల్లో ప్రతీ ఒక్కరికీ క్రమశిక్షణ అవసరమని స్పష్టం చేశారు. మాగుంట కుటంబం ఎప్పటి నుంచో మద్యం వ్యాపారంలో ఉందని... అలాంటి వాళ్లు తప్ప మిగిలిన వాళ్లు కొత్తగా మద్యంలో వేలు పెడతామంటే కుదరదన్నారు. మద్యంలో వైసీపీ నేతలు దోచిన డబ్బు బస్తాలు బస్తాలుగా వారి దగ్గర ఉందన్నారు. ‘‘మన దగ్గర మంచి లేకపోతే... డబ్బు ద్వారా ఏ ఎన్నికా గెలవలేం. మద్యం, ఇసుక విధానాలపై మళ్లీ విడిగా అందరితో మాట్లాడతా. ప్రతీ నియోజకవర్గంలో ఒకటీ అంతకంటే ఎక్కువ పారిశ్రామిక పార్కులు పెడతాం. రైతుల భాగస్వామ్యంతోనూ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తాం. రైతుల భూముల్ని అభివృద్ధి చేసేందుకు డెవలపర్స్ ముందుకొస్తే,రైతులకు పరిశ్రమల్లో భాగస్వాముల్ని చేసి వారి జీవితాల్లో మార్పులు తీసుకొస్తాం. వైసీపీ తవ్విపోయిన గుంతలను దాదాపు రూ.700 కోట్లు ఖర్చు పెట్టి మనం పూడ్చుతున్నాం. గ్రామాల్లో, పట్టణాల్లో టన్నుల కొద్దీ వైసీపీ చెత్తపేర్చినా మన నేతలెవ్వరూ చూడట్లేదు, మాట్లాడట్లేదు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా... పరిష్కరించే బాధ్యత నాయకులదే. ఎన్నికల్లో సూపర్ 6 పథకాలు మాదిరి ప్రభుత్వం సూపర్ 6 పాలసీలు తీసుకొచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ 6 పాలసీలు గేమ్ ఛేంజర్ కానున్నాయి’’ అని పేర్కొన్నారు.


అన్నీ నేనే పరిష్కరించడం కుదరదు..

‘‘2029లో మళ్లీ గెలవాలంటే ఎన్డీఏ ను అనుసంధానం చేసుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యేలను భాగస్వాముల్ని చేస్తా. రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులతో పాటు కేంద్రం చేసే పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మూడు పార్టీలు సమన్వయం చేసుకోవటం, అవసరమైన సందర్భాల్లో అధ్యక్షులు మాట్లాడుకోవటం చేస్తాం. తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేని 41 నియోజకవర్గాల్లో టీడీపీని కాపాడుకోవటంతో పాటు మిత్రపక్ష ఎమ్మెల్యేలకు అండగా నిలవాలి. ఎవరిదారి వారు చూసుకుంటే మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టీ ప్రతీ నియోజకవర్గంలో మూడు పార్టీల సమన్వయం అవసరం. ప్రతీ సమస్యా నా దగ్గరకే రావాలి, నేనే పరిష్కరించాలంటే కుదరుదు. మంత్రులూ దీనికి బాధ్యత తీసుకోవాలి. ప్రజా వినతులను పరిష్కరించటానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి బాధితుల్లో నమ్మకం పెంచాలి. వచ్చే ప్రతీ వినతి సాధ్యం కాకపోతే ఎందుకు సాధ్యం కాదో వివరణ ఇవ్వాలి, సాధ్యమయ్యే ప్రతీ వినతి పరిష్కరించాలి’’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Lokesh: ఆ ఖర్చును నా ఖాతాలో వేస్తారా: నారా లోకేశ్

YS Sharmila: ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు.. కూటమి సర్కార్‌కు షర్మిల సూటి ప్రశ్న

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 18 , 2024 | 02:39 PM