ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu: ఏపీకి రావాల్సినవే వచ్చాయి: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Jul 28 , 2024 | 11:10 AM

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆదివారం విజయవాడకు బయలుదేరి వస్తారు. మధ్యాహ్నం 1-50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శనివారం బిజీ బిజీగా గడిపారు. నీతి అయోగ్ భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఢిల్లీ (Delhi) పర్యటన ముగిసింది. ఆదివారం విజయవాడ (Vijayawada)కు బయలుదేరి వస్తారు. మధ్యాహ్నం 1-50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శనివారం బిజీ బిజీగా గడిపారు. నీతి అయోగ్ భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) అంశంపై చర్చించారు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు.


విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవే వచ్చాయని ప్రత్యేకంగా ఏదో ఇచ్చారన్నట్లు కొందరు రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. పోలవరం, అమరావతి విషయంలో కేంద్రం సాయం చేస్తున్నందున చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ హయాంలో పొలవరం ప్రాజెక్టును నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేసిన నష్టాన్ని పూడ్చే బాధ్యత ప్రజలు ఎన్డీయేకు అప్పగించారన్నారు. పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.


పోలవరానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. శనివారం, ఇక్కడ శ్రమశక్తి భవన్‌లో కేంద్రమంత్రితో భేటీ అయిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన రూ.12,500 కోట్ల ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం వెంటనే ఆమోదించేలా చూడాలని కోరినట్లు చెప్పారు. నవంబర్లో పనులు ప్రారంభించాలనుకుంటున్నామని, ఆ మేరకు నిధులివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించడానికి ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచినట్లు తెలిపారు. ‘కొత్త వాల్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. దాని నిర్మాణానికి అనుగుణంగా యంత్రాలను తరలించాల్సి ఉంటుందని, ఇదే విషయంపై రాష్ట్ర కేబినెట్‌లో కూడా చర్చించామని, కేబినెట్‌ నోట్‌ను కేంద్ర మంత్రికి అందించినట్లు చెప్పారు. పోలవరంపై నిధులు ఖర్చు చేసేందుకు ఇన్వె్‌స్టమెంట్‌ బోర్డు ఆమోదం తెలిపిందని, ఇప్పుడది కేంద్ర కేబినెట్‌ ముందుకు వెళ్లాల్సి ఉందని వివరించారు. ’పోలవరం ప్రాజెక్టులో ముందు డయాఫ్రం వాల్‌ కొత్తది నిర్మించాలి. ఆ తర్వాత ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం నిర్మించాలి. కాఫర్‌ డ్యాంలు కొంత తగ్గించి.. సీపేజ్‌ అంతా ఎత్తిపోస్తూ.. వాల్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. రెండు సీజన్ల కంటే ముందే.. దీనిని కట్టేస్తే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనులు వెంటనే చేపట్టవచ్చు. ప్రాజెక్టులో తొలిదశ, మలిదశ అనేవి లేవు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం ఒక్కటే మా లక్ష్యం. చేపట్టాల్సిన పనుల్లో ముందు ఏవి పూర్తి చేయాలనేందుకే దశలుగా పేర్కొంటున్నాం. ప్రాజెక్టు పనులపై మూడు నెలల్లో ఒక నిర్ణయం తీసుకుని పనులు చేపట్టకపోతే.. మరో సీజన్‌ కూడా కోల్పోయే అవకాశం ఉంది. వరద తగ్గిన వెంటనే పనులు మొదలు పెడితే పనులు కొలిక్కి రావడానికి రెండు సీజన్లు పడుతుంది’ అని ఆందోళన వ్యక్తంచేశారు.


జగన్‌ పాలనలో సర్వనాశనం

విభజన చట్టంలో అంశాలన్నీ అమలు చేస్తున్న దశలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిందని.. ఇప్పుడు విభజన నాటి పరిస్థితి కంటే రాష్ట్రం ఇంకా దిగజారిపోయిందని చంద్రబాబు తెలిపారు. అప్పులు చేయడం, తలసరి ఆదాయం తగ్గిపోవడం, పోలవరం నాశనం, అమరావతి నాశనం, పరిశ్రమలు పారిపోవడం వంటివన్నీ జరిగాయని చెప్పారు. స్వచ్ఛ భారత్‌, జల్‌ జీవన్‌ మిషన్‌ పథకాల్లో గత ఐదేళ్లలో ఏపీ అనేక రాష్ట్రాల కంటే వెనుకబడిందని, చివరి నుంచి మూడో స్థానంలో ఉందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను జగన్‌ ప్రభుత్వం దారి మళ్లించిందని, కేంద్రంలో ఏ శాఖ దగ్గరకు వెళ్లినా.. రాష్ట్రం వెనుకబడిన గణాంకాలే చూపిస్తున్నారని అన్నారు. ‘గడచిన ఐదేళ్లలో విభజన కంటే ఎక్కువ అధ్వాన స్థితికి ఏపీ పడిపోయింది. తలసరి ఆదాయం పడిపోయింది. రాష్ట్ర విభజన వల్ల, జగన్‌ విధ్వంస పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయినందునే పునర్నిర్మాణం కోసం సహాయం అడుగుతున్నాం. విభజన నుంచి తేరుకుని రాష్ట్రాన్ని మేం బాగు చేస్తున్న సమయంలో ప్రజలు ఆయన(జగన్‌)కు అవకాశం ఇచ్చారు. మొత్తం నాశనం చేశాడు. ఆయన ఐదేళ్ల పాలన చూసి మాకు చరిత్రాత్మక విజయాన్ని ఇచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను మాకు అప్పగించారు. ఇప్పుడు ఏ శాఖకు వెళ్లినా.. గత ప్రభుత్వ నిర్వాకాలపై మమ్మల్ని అడుగుతున్నారు. జరిగిన తప్పిదాలకు వైసీపీ సమాధానం చెప్పాలి’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి నేడు కల్వకుర్తి పర్యటన..

భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

జగన్‌ ధ్వంస రచన.. అబద్ధాలే ఆలంబన!

పదేళ్లలో ఏపీ అగ్రగామి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 28 , 2024 | 11:10 AM

Advertising
Advertising
<