ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Free Sand: ఉచిత ఇసుక విషయంలో సీఎం సీరియస్.. మంత్రులకు వార్నింగ్..

ABN, Publish Date - Oct 16 , 2024 | 03:33 PM

ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టినా ఇసుక పొందడంలో ఇబ్బందులు పడటంతో పాటు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంత్రమండలి సమావేశంలో చంద్రబాబు ఇసుక విషయంలో సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు..

AP Cabinet

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక విధానం యొక్క లక్ష్యం నెరవేరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు స్పష్టంచేశారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టినా ఇసుక పొందడంలో ఇబ్బందులు పడటంతో పాటు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంత్రమండలి సమావేశంలో చంద్రబాబు ఇసుక విషయంలో సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచడంతో పాటు ఇంటి నిర్మాణంలో ఇసుక కొనుగోలు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడితే కొందరు దళారులు సామాన్య ప్రజలకు ఇసుకను భారంగా మార్చడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉచిత ఇసుక విధానంలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని, వెంటనే మార్పు రావాలని చంద్రబాబు ఆదేశించారు.


పది రోజుల్లో..

ఉచిత ఇసుక విధానంలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని, వెంటనే మార్పు రావాలని చంద్రబాబు ఆదేశించారు. పది రోజుల్లో మార్పు కనిపించాలని, నిజమైన లబ్ధిదారుడికి ఉచిత ఇసుక పథకంతో ప్రయోజనం కలగాలని సీఎం పేర్కొన్నారు. ఇసుక రాష్ట్రం లో విరివిగా దొరకాలని, అన్ని అడ్డంకులు తొలగించి సామాన్య ప్రజలకు ఉచిత ఇసుక అందించి తీరాలని చంద్రబాబు స్పష్టం చేశారు.


ఉచిత ఇసుక విషయంలో

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక విధానాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో భాగంగా ఇసుక రీచ్‌ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలనే ప్రతిపాదనకు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఉచిత రీచ్‌లకు అదనంగా ప్రైవేటు రీచ్‌లనూ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పేరు ఏదైనా... ప్రజలకు అవసరమైన ఇసుక, వారికి ఆమోదయోగ్యమైన ధరతో అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. అక్టోబర్ 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఇసుకపై సమీక్షించారు. ఈ సందర్భంగా గనుల శాఖ అధికారులు పలు ప్రతిపాదనలను సీఎం ముందుంచిన విషయం తెలిసిందే. రీచ్‌లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం వల్ల ఇసుక స్టాక్‌ పాయింట్ల పరిశీలన, నిరంతర, సరఫరా పర్యవేక్షణ సులభతరం అవుతుందని అధికారులు కోరగా.. ఇసుక సరఫరా ధరను జిల్లా ఇసుక కమిటీలే నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు తావులేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. నిరంతర నిఘా, పర్యవేక్ష ణ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇసుక రీచ్‌ల నిర్వహణకు జిల్లాల వారీగా టెండర్ల ద్వారా ప్రైవేటు ఏజెన్సీలను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. ఇసుక లభ్యతను పెంచేందుకు ప్రైవేటు రీచ్‌లను ప్రారంభించాలని గనుల శాఖ ప్రతిపాదించింది. దీని ప్రకారం ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, ఏజెన్సీలు గనుల శాఖ నుంచి అనుమతి తీసుకొని సొంతంగా రీచ్‌లను ప్రారంభించి ఇసుక తవ్వకాలు చేపడతారు. ఉచిత ఇసుక పాలసీలో భాగంగా ప్రస్తుతం ఇసుక రీచ్‌లు గనుల శాఖ నియంత్రణలో ఉన్నాయి. వర్షాకాలం కావడంతో రీచ్‌ల్లో తవ్వకాలు చేపట్టడం లేదు. త్వరలో తవ్వకాలు ప్రారంభించినప్పటికీ డిమాండ్‌కు సరిపడేంతగా ఇసుక అందుబాటులోకి రాదనే ఉద్దేశంతో ప్రైవేటు రీచ్‌ల ప్రతిపాదన తెస్తున్నట్లు గనుల శాఖ అధికారులు వివరించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 16 , 2024 | 03:46 PM