ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu: ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చంద్రబాబు

ABN, Publish Date - Sep 14 , 2024 | 09:26 AM

Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగియనుంది. మరికాసేపట్లో ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరబాద్‌కు ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. నిన్న (శుక్రవారం) రాత్రి సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు.

CM Chandrababu Naidu

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఢిల్లీ పర్యటన ముగియనుంది. మరికాసేపట్లో ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరబాద్‌కు (Hyderabad)ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. నిన్న (శుక్రవారం) రాత్రి సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఏచూరి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం తిరిగి ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు పయనం కానున్నారు.

kadambari Jethwani: జెత్వానీ కేసులో ఇద్దరిపై వేటు


ఏచూరికి నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ... పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన చేసిన పోరాటాన్ని వాళ్లు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరితో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని తెలిపారు. అందుకే ఆయన్ను కడసారి చూసి, నివాళులు అర్పించేందుకు ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. 40 ఏళ్లుగా ఆయన్ను దగ్గరి నుంచి చూశానని, మంచి నాయకుడని చెప్పారు.


ఎన్నో పోరాటాల్లో ఆయనతో కలిసి నడిచినట్లు తెలిపారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన సీతారాం అసాధారణ వ్యక్తిగా ఎదిగారన్నారు. కమ్యూనిజం పట్ల ఆసక్తి పెంచుకుని, ఆ పార్టీలో చేరి అంచలంచెలుగా ఎదిగి, పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారని కొనియాడారు. అందరినీ నవ్వుతూ పలకరిస్తూ కలుపుగోలుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. దేశం గొప్ప రాజకీయ నాయకుడిని కోల్పోయినందుకు బాధగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. అంతకుముందు ఏచూరి మృతదేహన్ని ఎయిమ్స్‌ నుంచి జేఎన్‌యూకు తరలించారు. తర్వాత ఆయన స్వగృహానికి తరలించారు.

AP Floods: అందరికీ సాయం..



ప్రజల సందర్శనార్థం...

సీతారాం ఏచూరి భౌతిక కాయాన్ని నేడు (ఆదివారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సీపీఎం ప్రధాన కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం ఏచూరి కోరిక మేరకు ఆయన మృతదేహన్ని ఎయిమ్స్‌కు అప్పగించనున్నారు.


ఇవి కూడా చదవండి...

YS Jagan నిజమే.. ఏలేరు ఆధునికీకరణ చేపట్టలేదు

Narendra Modi: 45 ఏళ్ల తర్వాత తొలిసారి దోడాకు ప్రధాని.. కారణమిదే..

Read Latest AP News ANd Telugu News

Updated Date - Sep 14 , 2024 | 09:34 AM

Advertising
Advertising