CM Chandrababu: సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ABN, Publish Date - Sep 06 , 2024 | 08:30 PM
ఏపీలో ఆరు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏరియల్ సర్వే నిర్వహించి కొల్లేరు వరకూ వెళ్లి తర్వాత బుడమేరును అధ్యయనం చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కృష్ణనదికి వస్తున్న వరదపై క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు వివరించారు. బుడమేరులో ఇంకా పని ముమ్మరంగా జరుగుతోందని అన్నారు.
అమరావతి: ఏపీలో ఆరు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయిని.. ఈ నేపథ్యంలో ఏరియల్ సర్వే నిర్వహించి కొల్లేరు వరకూ వెళ్లి తర్వాత బుడమేరును అధ్యయనం చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) తెలిపారు. కృష్ణానదికి వస్తున్న వరదపై క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు వివరించారు. బుడమేరులో ఇంకా గండ్లు పూడ్చే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు.
ముందు బుడమేరు బ్రీచ్ క్లీన్ చేయాలని.. అప్పుడే తాము చేసే పనికి సార్థకత అవుతుందని తెలిపారు. మూడు బ్రీచ్‌లలో రెండు క్లోజ్ అయ్యాయని.. ఇంకా ఒక్కటి ఉందని చెప్పారు. నిన్న 9వేల క్యూసెక్కుల నీరు వచ్చిందని.. ఇప్పడు తగ్గి 3000 క్యూసెక్కులు నీరు వస్తోందని తెలిపారు. ఈ రాత్రికి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనైనా తొలగించేలా పనులు పూర్తిచేస్తామని అన్నారు. రాత్రికి ఎట్టి పరిస్థితుల్లోనైనా పనులు పూర్తి చేస్తామన్నారని... అటు క్యాచ్‌మెంట్‌లో కూడా ఇప్పటివరకు వర్షం పడలేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈరోజు రాత్రికి వర్షం పడితే మాత్రం బుడమేరుకు పై నుంచి నీరు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని ఈ విషయంపై ఎలా పని చేయాలో ఆలోచిస్తున్నామని చెప్పారు. 32 వార్డులను డివిజన్ల కింద విభజించి అక్కడ ఉన్న వారికి సమాచారం ఇస్తున్నామని వెల్లడించారు. ఈరోజు శానిటేషన్ పనులు 76.2 శాతం జరిగాయని చెప్పారు. ఎక్కడైనా వరద బాధితులకు ఇచ్చే ఆహరం నాణ్యతగా లేకపోతే తయారీ దారులను తప్పించి వేరే వారికి అప్పగిస్తున్నామని తెలిపారు. 3లక్షల 12 వేల 300 ఫుడ్ ప్యాకెట్లను ఇప్పటివరకు పంపిణీ చేశామని అన్నారు. నాలుగు లక్షల 51 వేల ప్యాకెట్ల పాలను పంపిణీ చేశామని సీఎం చంద్రబాబు వివరించారు.
224 ట్యాంకర్లు తాగునీటిని అందించామని, 24 ట్యాంకులు శానిటేషన్‌కు వాడుతున్నామని స్పష్టం చేశారు. ప్రజలు పైప్ కనెక్షన్ల నుంచి వచ్చే తాగు నీటిని ఇంకా రెండు రోజుల పాటు వాడొద్దని.. పైపుల్లో బురద నీరు వచ్చే అవకాశం ఉండటంతో వాడొద్దని సూచించామని అన్నారు. శానిటేషన్‌కు అన్ని ప్రాంతాల్లో 7100 మంది సిబ్బంది రాత్రి సమయంలో కూడా పనిచేస్తున్నారని తెలిపారు. భారీ వర్షాలతో పాడైన 490 కిలో మీటర్ల రోడ్లను మరమ్మతు చేసినట్లు వివరించారు. భారీ వర్షాలతో వరదలతో నిండిపోయిన 10వేల ఇళ్లను ఇప్పటికే శుభ్రం చేశామని.... రాత్రికి మరో 15వేల ఇళ్లను శుభ్రం చేస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. ప్రజా రవాణా విషయంలో 681 వాహనాలు పనిచేస్తున్నాయని.. అలాగే 1300 పీడీఎస్ ట్రక్కులు పనిచేస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఇవేకాకుండా 161 పవర్ బోట్లను ఇంకా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. భారీ వర్షాల వల్ల ఏపీ వ్యాప్తంగా 28మంది చనిపోయినట్లు గుర్తించామని అన్నారు. వారి అంత్యక్రియలు చేసుకోవడనికి ప్రభుత్వ పరంగా కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చామని అన్నారు. చాలామంది ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు మరమ్మతులు చేయడానికి అవసరమని అన్నారు. ఏపీలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఉపాధి కల్పించాలని అనుకుంటున్నామని అన్నారు. డ్రోన్లతో తొలిసారిగా ఆహరం అందించామని చెప్పారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి మంత్రులు, అధికారులు, టీడీపీ నేతలు త్వరగా సాయం అందించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఈరోజు నుంచి మూడు రోజుల్లో వరద బాధితులకు చేయాల్సిన సాయం చేస్తామని మాటిచ్చారు. డ్రైఫ్రూట్లు, పాలు వారికి అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడా అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కొంతమంది వ్యాపారులు కూరగాయలు రేట్లు విపరీతంగా పెంచేశారని అన్నారు. రూ, 2, 5, 10లకు మాత్రమే వాటిని ఇవ్వాలని చెప్పామని అన్నారు. వ్యాపారులు రేట్లు పెంచకుండా ఉండేందుకు అధికారులు నిఘా పెట్టారని అన్నారు. ఇంట్లో పుస్తకాలు పోవడం, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా నీటిలో కొట్టుకు పోయాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
రేపు(శనివారం) ఉదయం కేంద్ర ప్రభుత్వానికి వరద సహయం కోసం రిపోర్టు పంపిస్తామని తెలిపారు. ప్రముఖ కంపెనీలు వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వ్యాపారులు చాలా మంది దెబ్బతిన్నారని... వారు నిలదొక్కకునేలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇస్సురెన్సు క్లెైయిమ్ చేయాలంటే.. ప్రభుత్వ పరంగా సాయం చేస్తామని వివరించారు. వరదల నుంచి విజయవాడకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడతామని సీఎం చంద్రబాబు అన్నారు..
ప్రకాశం బ్యారేజ్ కు 12 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని.. . దీంతో బ్యారేజ్ ను కూడా స్ట్రీమ్ లైన్ చేసేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఏపీని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరామని అన్నారు. ముంపు ప్రాంతాల్లో లోన్లను రీషెడ్యూల్ చేయిస్తామని అన్నారు. డాక్యుమెంట్లు పోయిన వారికి తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం అవసరమైన రిపోర్టు తాను పంపిస్తానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
YS Jagan: వైఎస్ జగన్‌కు ఊహించని షాక్.. పాస్‌పోర్ట్ రద్దు
Viral Video: అయ్యో.. పాపం.. ఈ మందు బాబుకు ఎంతో కష్టం వచ్చింది.. చెప్పు కూడా అతడికి అందడం లేదే..
Read LatestAP NewsAndTelugu News
Updated Date - Sep 06 , 2024 | 09:05 PM