ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New Sand Policy: సోమవారం నుంచే నూతన ఇసుక విధానం..

ABN, Publish Date - Jul 07 , 2024 | 08:41 PM

సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా ఇసుక ఉచితం(Free Sand)గా పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ సృజన(Collector Srujana) వెల్లడించారు. ఇసుక కావాల్సిన వారు కేవలం రవాణా ఖర్చులు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎనిమిది స్టాక్ పాయింట్లలో 5లక్షల మెట్రిక్ టన్నుల లభ్యత ఉందని ఆమె వెల్లడించారు. ఇసుక కావాల్సిన వారు ఆధార్ కార్డుతోపాటు, దిగుమతి చేసుకునే చిరునామా వివరాలు అందించాలని సూచించారు.

ఎన్టీఆర్: సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా ఇసుక ఉచితం(Free Sand)గా పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ సృజన(Collector Srujana) వెల్లడించారు. ఇసుక కావాల్సిన వారు కేవలం రవాణా ఖర్చులు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎనిమిది స్టాక్ పాయింట్లలో 5లక్షల మెట్రిక్ టన్నుల లభ్యత ఉందని ఆమె వెల్లడించారు. ఇసుక కావాల్సిన వారు ఆధార్ కార్డుతోపాటు, దిగుమతి చేసుకునే చిరునామా వివరాలు అందించాలని సూచించారు. ఎవరైనా అక్రమంగా డంపింగ్ చేసినా, ఇతర ప్రాంతాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానం ద్వారా రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం వేగం పుంజుకుంటుందని కలెక్టర్ సృజన చెప్పారు.


ఆంధ్రప్రదేశ్‌లో 2014 చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా పంపిణీ చేసేవారు. 2019ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఆ విధానం తీసివేసి వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. దీంతో ఇసుక లభ్యత కొరవై రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం పూర్తిగా కుంటుపడింది. ఆ రంగంపై ఆధారపడిన కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలూ చాలా ఉన్నాయి. అప్పటి జగన్ ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. రాష్ట్రంలో ఇసుక రవాణా చేసి కార్మికులను ఆదుకోవాలంటూ ఆందోళనలు చేస్తూ రోడ్లెక్కాయి.

అయినా వైసీపీ ప్రభుత్వ తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. తాజాగా ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఈనెల 8నుంచి ఈ విధానం రాష్ట్రంలో అమలు కానుంది. ఈ మేరకు నూతన ఇసుక విధానం ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశించారు.

Updated Date - Jul 07 , 2024 | 08:43 PM

Advertising
Advertising
<