ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vijayawada: రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులు ఖండిస్తూ వామపక్షాల సదస్సు..

ABN, Publish Date - Jun 03 , 2024 | 03:24 PM

పాలస్తీనా (Palestine) రఫా నగరం (Rafah city)పై ఇజ్రాయెల్ దాడులకు (Israeli attacks) నిరసనగా విజయవాడలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రజా సంఘాల నాయకులు సదస్సు నిర్వహించారు. ఇజ్రాయెల్ మారణకాండపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (CPM state secretary Srinivasa Rao) మండిపడ్డారు.

విజయవాడ: పాలస్తీనా (Palestine) రఫా నగరం (Rafah city)పై ఇజ్రాయెల్ దాడులకు (Israeli attacks) నిరసనగా విజయవాడలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రజా సంఘాల నాయకులు సదస్సు నిర్వహించారు. ఇజ్రాయెల్ మారణకాండపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (CPM state secretary Srinivasa Rao) మండిపడ్డారు. అంతర్జాతీయ న్యాయస్థానం, ఐక్యరాజ్యసమితి యుద్ధం నిలిపివేయాలంటూ ఇరు దేశాలను ఆదేశించినప్పటికీ మే26, 27, 28తేదీల్లో రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.


రఫా నగరంలోని గుడారాలపై దాడులు చేసి వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు దుమ్మెత్తి పోశారు. ఇజ్రాయెల్ మారణకాండను మోడీ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ మోడీ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. పాలస్తీనా పోరాటాన్ని బీజేపీ టెర్రరిజంగా చిత్రీకరిస్తోందని దుయ్యబట్టారు. శాంతి కోరే వారంతా వామపక్ష పార్టీలు చేపట్టే ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని, సోషల్ మీడియా ద్వారా దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రకటించాలని, పాలస్తీనాను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు.


యుద్ధం అంటే రెండు దేశాల సైన్యం మధ్య జరగాలని, బలం, బలగం ఉందని ఏకపక్షంగా మరో దేశంపై దాడి చేయడం సబబు కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI state secretary Ramakrishna) అన్నారు. భారత్ ప్రభుత్వం నుంచి ఇజ్రాయెల్‌కు సహకారం ఆపేయాలని డిమాండ్ చేశారు. మోడీ తీరు వల్ల అనేక దేశాల మధ్య సత్సంబంధాలు తగ్గిపోయాయని ఆరోపించారు. ఇజ్రాయెల్ మారణకాండతో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రఫా నగరంలోని శరనార్థుల శిబిరాలపై మే 26న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 45మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల్లో ఎక్కువ శాతం మహిళలు, పిల్లలు ఉన్నారనే విషయం ప్రసార మాధ్యమాల్లో చూసి తీవ్ర కలత చెందినట్లు తెలిపారు. ఈ దాడులు, దారుణాలపై ప్రపంచ వ్యాప్తంగా స్పందన వస్తోందని.. రాష్ట్రం, దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరగాలన్నారు. ఇజ్రాయెల్‌కు భారత్ నుంచి అందుతున్న సహకారం నిలిపివేసేలా మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

For more Andhrapradesh news and Latest News click here..

Updated Date - Jun 03 , 2024 | 04:33 PM

Advertising
Advertising