ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP BJP: హై కమాండ్‌కు ఆ జాబితాను పంపిస్తాం.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Mar 03 , 2024 | 09:29 PM

టీడీపీ - జనసేనతో పొత్తుపై తమ హై కమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari ) తెలిపారు. రెండు రోజుల పాటు బీజేపీ కీలక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాలు నేటితో ముగిశాయి. జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ వరుస సమావేశాల్లో పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల్లోని నేతలతో పలు కీలక అంశాలపై చర్చించారు.

విజయవాడ: టీడీపీ - జనసేనతో పొత్తుపై తమ హై కమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari ) తెలిపారు. రెండు రోజుల పాటు బీజేపీ కీలక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాలు నేటితో ముగిశాయి. జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ వరుస సమావేశాల్లో పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల్లోని నేతలతో పలు కీలక అంశాలపై చర్చించారు. మొత్తంగా 125 మందికి పైగా నేతలతో శివ ప్రకాష్ వరుస భేటీలు నిర్వహించారు. సమావేశాలకు సంబంధించిన వివరాలను మీడియాకు పురంధేశ్వరి వెల్లడించారు. నిన్న, నేడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించామని తెలిపారు. శివ ప్రకాష్ ఆధ్వర్యంలో పార్టీ పరిస్థితిపై 26 జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలుతో చర్చించినట్లు తెలిపారు. మ్యానిఫెస్టో కమిటీ నుంచి కూడా పలు అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు.

నడ్డా, మోదీ జన్మత్ రేఖను ప్రజల్లోకి తీసుకెళ్లామని చెప్పారని అన్నారు. ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించామన్నారు. సామాన్య ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటామని చెప్పారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో అభ్యర్థులపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నామన్నారు. వీటిని పార్టీ జాతీయ నాయకత్వానికి వివరిస్తామన్నారు. అధిష్ఠానం నిర్ణయం బట్టి ఏపీలో అడుగులు ఉంటాయని చెప్పారు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు 2000 మంది వరకు వచ్చారని అన్నారు. తమ స్థాయిలో వాటిని క్రోడీకరించా మన్నారు. ఒక్కో నియోజకవర్గంలో మూడు నుంచి ఐదుగురు అభ్యర్థులు పోటీకి ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. తమ పార్లమెంటరీ కమిటీ సమీక్ష చేసి అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలిపారు. ఈ రెండు రోజుల సమావేశాల్లో పొత్తులపై అభిప్రాయ సేకరణ జరగలేదన్నారు. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీకి అభ్యర్థులు జాబితా సిద్ధం చేశామని అన్నారు. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి బెటరనే విషయంపైనే చర్చ సాగిందన్నారు. పరిశీలించిన జాబితాను కేంద్రానికి రెండు రోజుల్లో పంపుతామని అన్నారు. ఆ తర్వాత జాతీయ నాయకత్వం నిర్ణయాన్ని బట్టి కార్యాచరణ ఉంటుందని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 09:30 PM

Advertising
Advertising