AP News: డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం సూసైడ్ ఘటనపై డీసీపీ వివరణ
ABN, Publish Date - Apr 30 , 2024 | 04:45 PM
Andhrapradesh: బెజవాడలో డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. శ్రీనివాస్ సహా ఐదుగురు కుటుంబసభ్యులు సూసైడ్ చేసుకున్నారు. విజయవాడలోని గురునానక్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ కుటుంబం ఆత్మహత్యపై డీసీపీ ఆదిరాజ్ రాణా స్పందించారు.
విజయవాడ, ఏప్రిల్ 30: బెజవాడలో డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. శ్రీనివాస్ సహా ఐదుగురు కుటుంబసభ్యులు సూసైడ్ చేసుకున్నారు. విజయవాడలోని (Vijayawada) గురునానక్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ కుటుంబం ఆత్మహత్యపై డీసీపీ ఆదిరాజ్ రాణా స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం చనిపోయినట్లు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు.
AP Elections 2024: కూటమి మేనిఫెస్టోలో ఉద్యోగులకు తీపికబురు!
లోతైన విచారణ చేస్తాం...
‘‘శ్రీనివాస్ బయట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అతని తల్లి, భార్య, ఇద్దరు పిల్లల మృతదేహాలు ఇంట్లో ఉన్నాయి. వారి మెడపై కత్తి తో గాట్లు ఉన్నాయి. డాక్టర్ శ్రీనివాస్ వారిని చంపినట్లు భావిస్తున్నాం. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా శ్రీనివాస్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చు. అతనికి అప్పులు బాగా ఉన్నాయని చెబుతున్నారు. క్లూస్ టీం ద్వారా పలు ఆధారాలు సేకరించాం. అప్పులు, ఆస్తులకు సంబంధించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. ఈరోజు పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం. మరింత లోతైన విచారణ చేశాక వివరాలు వెల్లడిస్తాం’’ అని డీసీపీ ఆదిరాజు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Stock Market: రోజంతా లాభాలు.. చివర్లో అమ్మకాలతో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
Read Latest AP News And Telugu News
10th ఫలితాల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 30 , 2024 | 05:08 PM