Pawan Kalyan: ఐఏఎస్ అధికారులతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తొలి సమీక్ష..
ABN, Publish Date - Jun 19 , 2024 | 03:48 PM
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం(AP Deputy CM)గా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇవాళ(బుధవారం) ఉదయం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ క్యాంపు కార్యాలయం(Vijayawada Camp Office)లో ప్రత్యేక పూజల అనంతరం అధికారిక పత్రాలపై ఆయన సంతకం చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం(AP Deputy CM)గా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇవాళ(బుధవారం) ఉదయం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ క్యాంపు కార్యాలయం(Vijayawada Camp Office)లో ప్రత్యేక పూజల అనంతరం అధికారిక పత్రాలపై ఆయన సంతకం చేశారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ ఫైళ్లపై ఉపముఖ్యమంత్రిగా తొలి సంతకాలు చేశారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం పవన్ కల్యాణ్ ఆయా శాఖలకు సంబంధించిన పనులను చకచకా ప్రారంభించారు. తన క్యాంపు ఆఫీసులో ఐఏఎస్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక అంశాలపై చర్చించారు. గ్రామాలలో మౌలిక వసతులు, రోడ్లు నిర్మాణం, మంచినీటి ఎద్దడి నివారణ వంటి అంశాలపై ఐఏఎస్ అధికారులకు పవన్ కల్యాణ్ పలు సూచనలు చేశారు.
ప్రణాళికలు సిద్ధం చేసి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మూడు నెలల తర్వాత పనుల పురోగతిపై పునఃసమీక్ష చేస్తానన్నారు. ఈ మూడు నెలల కాలంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హితవు పలికారు.
ఇది కూడా చదవండి:
Minister Dola: రుషికొండ భవనాలు కచ్చితంగా వినియోగిస్తాం: మంత్రి వీరాంజనేయస్వామి
Updated Date - Jun 19 , 2024 | 03:50 PM