ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: కాలుష్య కోరల నుంచి సమాజాన్ని రక్షిద్దాం.. ఇదే నా విజ్ఞప్తి

ABN, Publish Date - Oct 09 , 2024 | 11:42 AM

Andhrapradesh: పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన వర్కుషాపుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘భవిష్యత్ తరాల కోసం.. మనమంతా ఇప్పటి నుంచే ఆలోచన చేయాలి. జల, వాయి కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి’’...

Deputy CM Pawan Kalyan

విజయవాడ, అక్టోబర్ 9: పరిశ్రమల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో విజయవాడలో వర్కుషాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు నిపుణులు, మేధావులు, ఎన్జీవోల సూచనలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ వర్కుషాపు ద్వారా పరిశ్రమల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ రెండు అంశాలపై వేసే అడుగులపై అందరికీ స్పష్టత వస్తుందన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో ఎంతవరకు కాలుష్యాన్ని నియంత్రించాలనే అంశంపై ఆలోచన చేస్తున్నామని తెలిపారు.

Gold And Silver Price: దిగొస్తోన్న బంగారం.. ధర ఎంతంటే



పెరుగుతున్న కాలుష్యంపై ఆందోళన...

‘‘పీసీబీ ఛైర్మన్‌కు నా ఆలోచన చెప్పిన వెంటనే.. ఈ వర్కుషాపును ఏర్పాటు చేశారు. అన్ని రంగాల నిపుణులు, ఎన్జీవోలను ఆహ్వానించడం అభినందనీయం. నేను పర్యావరణ ప్రేమికుడిని.. ప్రకృతి బాగుండాలని కోరుకునే వ్యక్తిని.. ప్రకృతి ప్రేమికులు ఎంత తపన పడతారో నాకు తెలుసు. భూమి మీద కనీస బాధ్యత లేకుండా మనం జీవనం సాగిస్తున్నాం. భూమిని మనం సొంతం చేసుకోవడం కాదు.. భూమే ఏదొకనాటికి మనలను సొంతం చేసుకుంటుంది. 974 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంది.. దానిని అభివృద్ధి చేయాలి. పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా.. పరిశ్రమల ఏర్పాటు కావాలి. భవిష్యత్ తరాల కోసం.. మనమంతా ఇప్పటి నుంచే ఆలోచన చేయాలి. జల, వాయి కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి’’ అని పిలుపునిచ్చారు.


ప్రత్యేక దృష్టి...

‘‘ఈ వర్కుషాపుకు వచ్చిన నిపుణులు సలహాలతో సమాజానికి మరింత మేలు జరగాలనేది నా ఆకాంక్ష. మీ అనుభవం, మీ మేధస్సు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలి. విపరీతంగా కాలుష్యం పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కాలుష్య కోరల నుంచి సమాజాన్ని రక్షించడంలో మీరంతా పాత్రధారులు కావాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే.. పరిశ్రమల యాజమాన్యాలలో అపోహలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడతారనే అభద్రత పీసీబీపై ఉంది. దీంతో ఆ తర్వాత పాలకులు పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యాన్ని పట్టించుకోవడం మానేశారు. ఇక నుంచి పరిశ్రమల ఏర్పాటు, కాలుష్యం నివారణ రెండు అంశాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాం. మీ అమూల్యమైన సలహాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని నా విజ్ఞప్తి’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.


పరిశ్రమలతో పాటు ప్రజల ఆరోగ్యమూ ముఖ్యమే: కృష్ణయ్య

ఈ వర్క్‌షాప్‌లో రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య, ఐఏఎస్ జీ. అనంత రాము, వ్యర్థ పదార్థాల నిర్వహణలో పర్యావరణ సవాళ్లపై స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి. చంద్రుడు ఐఏఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. ‘‘పరిశ్రమల అభివృద్ధితో పాటు, కాలుష్య నియంత్రణ కూడా అరికట్టేలా భాగస్వామ్యుల అభిప్రాయాలను తీసుకునేందుకు ఈ వర్కుషాపు. ప్రజల భాగస్వామ్యంతో సూచనలు, సలహాలతో ముందుకు సాగాలని భావిస్తున్నాం. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. భవిష్యత్‌లో పరిశ్రమల ఏర్పాటు చేస్తూనే కాలుష్యాన్ని ఎలా నివారించాలనే దానిపైనా ఆలోచన చేస్తున్నాం. స్వచ్చంధ సంస్థలు కూడా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. వారి సలహాలు కూడా తీసుకుని, కాలుష్య నియంత్రణకు కృషి చేసేలా ముందుకు సాగుతాం. ఈ వర్కుషాపులో తమ విలువైన సూచనలు చేసేందుకు నిపుణులు కూడా అనేక మంది వచ్చారు. జల కాలుష్యం, వాయి కాలుష్యం నివారించేందుకు పర్యావరణ చట్టం తీసుకు వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత పరిశ్రమలు ఎక్కువుగా తెలంగాణాలోనే ఉండిపోయాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఆర్ధిక ప్రగతి సాధించాలన్నా పరిశ్రమలు, అనుబంధ సంస్థలు అవసరం. కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు అందరూ కృషి చేయాలి. పరిశ్రమల ఏర్పాటు ఎంత ముఖ్యమో, ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అందరి అభిప్రాయాలు ఆలోచనలు పంచుకుని.. పరిశ్రమల ఏర్పాటుతో పాటు, కాలుష్య నివారణ లక్ష్యంగా పని చేయాలి’’ అని కృష్ణయ్య వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Bathukamma: ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ

Bathukamma: హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 09 , 2024 | 11:51 AM