Tirumala Laddu Controversy: పొన్నవోలు, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన పవన్
ABN, Publish Date - Sep 24 , 2024 | 10:25 AM
Andhrapradesh: ‘‘పొన్నవోలు సుధాకర్ పొగరుగా మాట్లాడారు... తమాషాలుగా ఉందా.. సరదాలుగా ఉన్నాయా. అపవిత్రం జరిగిందని మాట్లాడాను.. మాట్లాడకూడదా. ప్రకాష్ రాజ్‌కు కూడా చెపుతున్నా... సెక్యులరిజం టూవే.. ఒన్ వే కాదు.. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉంది.. కానీ ఆయన సరిగా మాట్లాడాలి’’...
విజయవాడ, సెప్టెంబర్ 24: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ సన్నిధికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan).. అమ్మవారి మెట్టు శుభ్రం చేసి పూజ చేశారు. దుర్గమ్మ దర్శనానంతరం ఉపముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ... ‘‘ప్రాయశ్చిత్త దీక్షకు ఇవాళ మూడోరోజు. మేము రామభక్తులం.. ఆంజనేయస్వామిని పూజిస్తాం.. సగటు హిందువుకు ఎలాంటి భయం, ఇతర మతాల పైన ద్వేషం ఉండదు. కనకదుర్గమ్మ రథం సింహాలు మాయమైతే వైసీపీ నేతలు అపహాస్యం చేశారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలీదు. జగన్‌ను నేను ఎత్తి చూపడం లేదు... మీ సమయంలో జరిగిన అపచారంపై స్పందించాలి’’ అని అన్నారు.
Pawan: దుర్గగుడికి పవన్.. మెట్లు శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం
మేం చాలా బాధపడ్డాం...
సెక్యూలరిజం అన్ని వైపుల నుంచి రావాలన్నారు. సాటి హిందువులు తోటి హిందువులను తిట్టడం ఆక్షేపణీయమన్నారు. మసీదులో చిన్న అపచారం జరిగితే ఇలాగే మాట్లాడతారా.. హిందువుల పట్ల ఎలా మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పొన్నవోలు సుధాకర్ పొగరుగా మాట్లాడారు... తమాషాలుగా ఉందా.. సరదాలుగా ఉన్నాయా. అపవిత్రం జరిగిందని మాట్లాడాను.. మాట్లాడకూడదా. ప్రకాష్ రాజ్‌కు కూడా చెపుతున్నా... సెక్యులరిజం టూవే.. ఒన్ వే కాదు.. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉంది.. కానీ ఆయన సరిగా మాట్లాడాలి. సనాతన ధర్మంపై దాడి జరిగినప్పుడు మాట్లాడకూడదా. మేం చాలా బాధపడ్డాం.. మీకు ఇది ఇదంతా హాస్యం కావచ్చు. మాకు ఇదంతా చాలా బాధను కలిగించింది. ఇష్టానికి సనాతన ధర్మం పై మాట్లాడుతున్నారు. మీరు సరస్వతీ దేవి, దుర్గాదేవిలపై జోకులు వేస్తారా. సనాతనధర్మ రక్షణ అనేది గుడికెళ్ళే ప్రతీ హిందువు బాధ్యత కాదా. పొన్నవోలు మదమెక్కి మాట్లాడుతున్నారు. నా మీద కోర్టులో కేసులేసుకోండి.. సనాతన ధర్మం గురించి మాట్లాడితే రోడ్లమీదకు లాగుతాం’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Tirupati Laddu: తిరుమల లడ్డూ వ్యవహారం.. సిట్ అధిపతి ఎవరంటే..
ఏం చేయలేం అనుకుంటున్నారా...
‘‘భూమన కరుణాకర్ రెడ్డి నాశనం మొదలైంది. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి కూడా విచారణకు రావాలి. ధర్మారెడ్డి మాయమైపోయారు. ధర్మారెడ్డి హిందువా.. బిడ్డ చనిపోయిన పదకొండు రోజుల్లోపు గుడికి వచ్చేస్తారా. ఇస్లాం, ముస్లింలకు జరిగితే ఇలాగే ఉంటారా. సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తే.. చనిపోవడానికి సిద్ధం నేను. మీ ప్రభుత్వాన్ని పడకొట్టిన మేము.. ఏమీ చేయలేం అనుకుంటున్నారా. మీ మౌనంతో తరాలు నాశనం అయిపోతాయి.. భారతదేశపు సినిమా అభిమానులు అందరూ హిందువులు కాదా. ఇస్లాం మీద గొంతెత్తితే రోడ్లమీదకు వచ్చి కొడతారని మీకు భయం. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సైలెంట్‌గా ఉండాలి... మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడాలి. నిన్న సినిమా ఫంక్షన్ లో లడ్డు గురించి మాట్లాడారు’’ అంటూ పవన్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
Tirumala..టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డిపై కేసు
Hyderabad: ట్రాఫిక్ పోలీసుల ‘చిల్లర’ దందా!
Read Latest AP News And Telugu News
Updated Date - Sep 24 , 2024 | 11:46 AM