Pawan: అభివృద్ధిలో తెలంగాణ ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ..
ABN, Publish Date - Sep 17 , 2024 | 02:40 PM
Andhrapradesh: దేశమంతటికీ 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య ఫలాలు దక్కినా.. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు ఆ స్వేచ్చా వాయువులు పీల్చుకోవడానికి మరో 13 నెలలు వేచి చూడాల్సి వచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి, సెప్టెంబర్ 17: తెలంగాణ(Telangana) ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) తెలంగాణ విమోచన దినోత్సవ (Telangana Liberation Day) శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతటికీ 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య ఫలాలు దక్కినా.. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు ఆ స్వేచ్చా వాయువులు పీల్చుకోవడానికి మరో 13 నెలలు వేచి చూడాల్సి వచ్చిందన్నారు. మన దేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య చేపట్టడంతో నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తమైందని తెలిపారు.
NPS Vatsalya: రేపే కొత్త పథకం లాంచ్.. ఇకపై మీ పిల్లల భవిష్యత్తుకు మరింత భరోసా..
సెప్టెంబర్ 17న స్వేచ్ఛ పొంది స్వతంత్ర భారతంలో భాగమైందన్నారు. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజాం ఫ్యూడల్ పాలనకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం తాలూకు స్ఫూర్తి ఇప్పటికీ ప్రజల్లో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Viral Video: అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడిన గ్రామ సర్పంచ్.. షాక్ అయిన ఐఏఎస్ ఆఫీసర్
ఇవి కూడా చదవండి...
Rammohannaidu: అది చంద్రబాబు పనితీరు వల్లే సాధ్యం
TTD EO: తిరుమలలో ఏర్పాట్లపై మంత్రికి భక్తుడి ఫిర్యాదులో ట్విస్ట్.. అసలేం జరిగిందో చెప్పిన ఈవో
Read LatestAP NewsAndTelugu News
Updated Date - Sep 17 , 2024 | 02:47 PM