ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం తిరుమలకు పవన్

ABN, Publish Date - Sep 30 , 2024 | 12:36 PM

Andhrapradesh: ప్రాయశ్చిత్త దీక్ష విరమణ సందర్భంగా తిరుమలకు పవన్ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు తిరుమల్లోనే ఉండనున్నారు. రేపు సాయంత్రం అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాత్రి నడక మార్గం గుండా తిరుమలకు పవన్ చేరుకోనున్నారు.

Deputy CM Pawan Kalyan

తిరుమల, సెప్టెంబర్ 30: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) రేపు (మంగళవారం) తిరుమలకు (Tirumala) రానున్నారు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉపముఖ్యమంత్రి.. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ సందర్భంగా తిరుమలకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు తిరుమల్లోనే ఉండనున్నారు. రేపు సాయంత్రం అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాత్రి నడక మార్గం గుండా తిరుమలకు పవన్ చేరుకోనున్నారు. ఎల్లుండి (అక్టోబర్ 2) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Nara Bhuvaneswari: ప్రజలకు ఎల్లప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుంది


కొండపైనే బస..

దర్శనాంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. క్యూలైన్లను పరిశీలించనున్నారు. అనంతరం టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. బుధవారం రాత్రి కూడా కొండపైనే బస చేస్తారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష గురువారానికి పూర్తవుతుంది. దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు.


11 రోజులపాటు దీక్ష..

కాగా.. ఏడుకొండలవాడు కొలువైన క్షేత్రం తిరుమలలో ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో అపవిత్ర పదార్థాలు వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 22 నుంచి 11 రోజులపాటు ఆయన ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. దీక్ష విరమణ కోసం తిరుమల కొండకు వెళ్లనున్న పవన్.. స్వామివారిని దర్శించుకుని దీక్షను విరమించనున్నారు.

Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..


అయ్యా.. క్షమించు అంటూ..

"ఏడుకొండలవాడా..! క్షమించు. అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించా’’ అంటూ దీక్ష చేపట్టే ముందు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Golden Hour: గుండె పోటు తర్వాత గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు ఎందుకు? ఇది ఎందుకు అంత ముఖ్యం?

Israel: ఘోరం.. వెయ్యి మంది స్పాట్ డెడ్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 30 , 2024 | 02:35 PM