ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt: వరద బాధితులకు ప్రభుత్వం అందించిన నష్ట పరిహార వివరాలు ఇవే

ABN, Publish Date - Sep 25 , 2024 | 01:50 PM

Andhrapradesh: విజయవాడ కలెక్టరేట్‌లో వరద బాధితులకు నష్ట పరిహారాన్ని సీఎం చంద్రబాబు అందజేశారు. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం సాయం అందిస్తుంది. నేరుగా వరద బాధితుల ఖాతాల్లోకి నష్టపరిహారం సొమ్మును జమ చేశారు. ఎన్యూమరేషన్ పూర్తి కావడంతో అర్హులైన బాధితులందరికీ వారి ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ కానున్నాయి.

AP Government

అమరావతి, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరద ఉధృతితో సర్వం కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. భారీ వరదలు విజయవాడ వాసులను అంతలాకుతలం చేశాయి. భారీ వరదల నేపథ్యంలో ప్రభుత్వ (AP Govt) యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) సహా ప్రతీ ఒక్కరూ వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా వరద బాధితులకు సర్కార్ వరద సహాయాన్ని కూడా ప్రకటించింది.

Devara-KTR: ప్రెస్‌మీట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావించిన కేటీఆర్.. ఎందుకంటే?


బుధవారం నాడు సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్‌లో వరద బాధితులకు నష్ట పరిహారాన్ని అందజేశారు. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం సాయం అందిస్తుంది. నేరుగా వరద బాధితుల ఖాతాల్లోకి నష్టపరిహారం సొమ్మును జమ చేశారు. ఎన్యూమరేషన్ పూర్తి కావడంతో అర్హులైన బాధితులందరికీ వారి ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ కానున్నాయి. వరదలతో నష్టపోయిన వాహనాలకు బీమా చెల్లింపులు కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం అందించిన సహాయ వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి.

Jani Master: జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై కీలక తీర్పు ఇచ్చిన కోర్ట్


వరద నష్టం.. ప్రభుత్వ సాయం వివరాలు

  • వరద సాయం కింద బాధితు ప్రజలకు, పంట నష్టం కింద రైతులకు పరిహారం రూపంలో ప్రజలకు అందించిన మొత్తం - రూ.602 కోట్లు

  • భారీ వర్షాలు వరదలకు చనిపోయిన వారు 74 మందికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేత

  • భారీ వర్షాలకు చనిపోయిన పశ సంపద 1562

  • రాష్ట్ర వ్యాప్తంగా మునిగిన ఇళ్లు 1,18,070- పరిహారం రూ.215 కోట్లు

  • విజయవాడలో మొత్తం ముంపు నివాసాలు 78,558

  • విజయవాడలో పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లు 64,799

  • గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లకు రూ. 25 వేల చొప్పున సాయం రూ. 161.99 కోట్లు

  • విజయవాడలో ఒకటి, ఆపై అంతస్తులు 13759 ఇళ్లు

  • మొదటి ఆపై అంతస్తు వారికి రూ.10 వేల చొప్పన రూ.13.76 కోట్లు

  • చనిపోయిన వారికి, పశు సంపదకు పరిహారం రూ.6.83 కోట్లు

  • దెబ్బతిన్న 44402 ద్విచక్రవాహనాలకు రూ.3 వేల చొప్పున పరిహారం రూ.13.32 కోట్లు

  • దెబ్బతిన్న 4348 ఆటోలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం రూ.4.34 కోట్లు

  • దెబ్బతిన్న 1243 తోపుడు బండ్లకు రూ.20 చొప్పున పరిహారం రూ. 2.48 కోట్లు

  • దెబ్బతిన్న 5,181 కిరాణా షాపులు, హోటల్స్ రూ. 25 వేల చొప్పున పరిహారం రూ.12.97 కోట్లు

  • దెబ్బతిన్న 2500 చిన్నతరహా పరిశ్రమలకు రూ. 50 వేల చొప్పున రూ. 12.50 కోట్లు

  • దెబ్బతిన్న 469 పరిశ్రమలకు రూ. లక్ష చొప్పున రూ. 4.69 కోట్లు.

  • దెబ్బతిన్న 197 పెద్ద పరిశ్రమలకు రూ.1.50 లక్షల చొప్పున రూ. 2.95 కోట్లు

  • మొత్తం దెబ్బతిన్న 8347 పరిశ్రమలకు పరిహారం రూ.33.97 కోట్లు


పంటనష్టం వివరాలు...ప్రభుత్వ సాయం:

  • మొత్తం 1,12,345 హెక్టార్లతో 22 రకాల వ్యవసాయ పంటలకు పరిహారం రూ. 278 కోట్లు

  • మొత్తం 9236 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్ట పరిహారం రూ. 32.67 కోట్లు


ఇవి కూడా చదవండి..

AP Highcourt: ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలను నిలిపివేయండి.. హైకోర్ట్ ఆర్డర్స్

Lokesh: ఐటీ పాలసీపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 25 , 2024 | 02:19 PM