ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Devineni Uma: మీడియా ముందు మాట్లాడలేని అసమర్థుడు.. సీఎం జగన్

ABN, Publish Date - Jan 30 , 2024 | 09:47 PM

మీడియా ముందు మాట్లాడలేని అసమర్థ చేతగాని ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) ప్రశ్నించారు.

ఎన్టీఆర్ జిల్లా(ఇబ్రహీంపట్నం): మీడియా ముందు మాట్లాడలేని అసమర్థ చేతగాని ముఖ్యమంత్రి జగన్.. ఈ రాష్ట్రానికి అవసరమా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో దేవినేని మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీ ఏపీ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి పోలవరం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్లపై మాట్లాడాలని నిలదీశారు. ప్రజా వ్యతిరేకతకు జగన్ భయపడి చెట్లు కొట్టేసి పరదాలు కట్టుకొని సభలకు వెళ్తున్నాడని విమర్శించారు. కోర్టుల్లో చంపపెట్టు లాంటి తీర్పులు వస్తున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదని దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

కేశినేని నాని పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి

కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని తిరుగుతున్నారన్నారు. పనికిమాలిన కేశినేని నాని పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ సిద్ధాంతాలు, జగన్ అవినీతి గురించి మాట్లాడకుండా పిచ్చి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. లోకేష్ చంద్రబాబులను తిట్టినంత మాత్రానా నాని పెద్దవాడు కాలేడని చెప్పారు. తెలుగుదేశం భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ ఇచ్చిన ఆరు హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని తెలిపారు. ఎమ్మెల్యేలను ఎంపీలను మార్చినంత మాత్రాన ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడలేరని అన్నారు. వైసీపీ, జగన్ రెడ్డికి ఇవే చివరి ఎన్నికలని... వైసీపీని ప్రజలు 161 అడుగుల లోతులో పాతి పెడతారని దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.

Updated Date - Jan 30 , 2024 | 10:15 PM

Advertising
Advertising