ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Pension: వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జోరుగా పెన్షన్ల పంపిణీ...

ABN, Publish Date - Aug 31 , 2024 | 11:07 AM

Andhrapradesh: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున పంపిణీ షురూ అవగా... ఇప్పటికే 50 శాతానికి పైగా పెన్షన్లను సచివాలయాల సిబ్బంది అందచేశారు. వేకువజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది.

AP Pension

అమరావతి, ఆగస్టు 31: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల (AP Pension) పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున పంపిణీ షురూ అవగా... ఇప్పటికే 50 శాతానికి పైగా పెన్షన్లను సచివాలయాల సిబ్బంది అందచేశారు. వేకువజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. మొత్తం 64,61,485 పెన్షన్ లబ్దిదారులకు రూ. 2729.86 కోట్లను కూటమి సర్కార్ పంపిణీ చేయనుంది.

Road Accident: బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో కారు బీభత్సం..


గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇప్పటి వరకు 56 శాతం మేర పెన్షన్ల పంపిణీ చేపట్టారు.పెన్షన్ల పంపిణీలో శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాలు టాప్-3లో నిలవగా... అల్లూరి జిల్లా చివరి స్థానంలో ఉంది. జోరు వర్షంలోనూ సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ చేపడుతున్నారు. రేపు ఆదివారం కావడంతో ప్రభుత్వం ఓ రోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేస్తోంది.


ఒకరోజు ముందుగానే ...

సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ‘ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు’ ఒక రోజు ముందుగానే అంటే ఈ నెల 31నే కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలోనే నేటి తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో పించన్ల పంపిణీని అధికారులు చేస్తున్నారు. రాష్ట్రంలో పింఛన్ల పండుగ ఒకరోజు ముందే వచ్చింది. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం నెల వచ్చి రోజులు గడుస్తున్నా పంపిణీ చేసే పరిస్థితి ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పక్కాగా ఒకటో తారీఖు లేదంటే ఒకరోజు ముందుగానే పింఛన్లను పంపిణీ చేస్తున్నారు.ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెల పింఛన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తుండటంతో పింఛన్‌దారులు ఆనందంగా ఉన్నారు. సెప్టెంబర్ 1 ఆదివారం కావడం, ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినం కావడంతో సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల సెలవుకు భంగం కలగకుండా, పెన్షన్‌దారులకు నగదు అందడం కోసం ఒకరోజు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నారు.

Health Tips: సులైమాని టీ గురించి విన్నారా? దీన్ని తాగితే ఎన్ని లాభాలంటే..!



పెన్షన్ ఇవ్వనున్న సీఎం...

ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కర్నూలు జిల్లా మండల కేంద్రం ఓర్వకల్లులో పర్యటించనున్నారు. ఓర్వకల్లులో ఆయన లబ్ధిదారులకు నేరుగా పింఛన్లను అందజేయనున్నారు. గ్రామం నడిబొడ్డున ఉన్న రచ్చకట్ట వేదికగా గ్రామ సభ నిర్వహిస్తారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల కు సీఎం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో పించన్ల పంపిణీ గ్రామ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడే లబ్ధిదారులకు ఆయన పింఛన్లను పంపిణీ చేస్తారు. అనంతరం గ్రామ సభలో ప్రసంగిస్తారు. విశాఖపట్నం జిల్లాలో ఉదయం 6.00 గంటలకే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. తాటిచెట్లపాలెం వద్ద స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్దిదారులకు పింఛన్ల సొమ్మును జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అందజేశారు.

Updated Date - Aug 31 , 2024 | 11:11 AM

Advertising
Advertising