AP Donations: సర్వేపల్లి నియోజకవర్గం నుంచి రూ.3 కోట్ల విరాళం
ABN, Publish Date - Sep 10 , 2024 | 12:07 PM
Andhrapradesh: భారీ వరదలతో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. పెద్దమనుతో తమకు తోచిన సహాయాన్ని వరద బాధితులకు అందజేస్తున్నారు. ఇప్పటికే సినీ రంగానికి చెందిన వారు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు కోట్లు, లక్షల్లో వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేశారు.
అమరావతి, సెప్టెంబర్ 10: భారీ వరదలతో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. పెద్దమనసుతో తమకు తోచిన సహాయాన్ని వరద బాధితులకు అందజేస్తున్నారు. ఇప్పటికే సినీ రంగానికి చెందిన వారు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు కోట్లు, లక్షల్లో వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేశారు. ఇంకా వరద బాధితుల కోసం విరాళాల వెల్లువ కొనసాగుతూనే ఉంది. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Former Minister Somireddy Chandramohan Reddy) ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి దాదాపు రూ.3 కోట్లు విరాళంగా వచ్చింది.
Bhatti Vikramarka: తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించండి..
వరద బాధితుల్ని ఆదుకునేందుకు సర్వేపల్లి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫాట్స్ లిమిటెడ్ రూ.2కోట్ల విరాళం అందజేశారు. సీల్ సెమ్‌కార్ప్ థర్మల్ పవర్ ప్రాజెక్టు తరపున మరో రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. ఇతర పామాయిల్ పారిశ్రామిక వేత్తలు నుంచి దాదాపు మరో రూ.50 లక్షలు విరాళం కలిపి మొత్తం రూ.3 కోట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. మంగళవారం ఉదయం విజయవాడ కలక్టరేట్లో సీఎం చంద్రబాబును సర్వేపల్లి పారిశ్రామికవేత్తలు కలిసి ఈ మేర చెక్‌లను అందజేశారు.
ఇప్పటికే పలువురు ప్రముఖులు మంత్రి నారా లోకేష్‌ను కలిసి విరాళాలను ఇచ్చారు. దాచేపల్లి లక్ష్మీ గాయత్రి హాస్పిటల్స్ అధినేత కామాటి వరలక్ష్మి రూ. 5 లక్షలు, వల్లభనేని గిరిబాబు రూ.5 లక్షలు అందజేశారు. మంత్రి ఫరూక్ చేతుల మీదుగా నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముడియం కొండారెడ్డి రూ.61 వేలు, ఎలిశెట్టి హరనాథ్ రూ.30 వేలు అందజేశారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి నాగశ్రవణ్ రూ. 5 లక్షలు, దుగ్గిరాల నీలంపాటి అమ్మవారి కోల్డ్ స్టోరేజ్ అధినేత ఎండ్రాటి యజ్ఞతేజ రూ. 2 లక్షలు, విజయవాడకు చెందిన మార్పులు సత్యానందం గురువు రూ. 10వేలు విరాళంగా అందజేశారు. విరాళాలు అందజేసిన దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు దాతలు నుంచి మంచి స్పందన వస్తోంది. సీఎం సహాయనిధికి కాకినాడ సీపోర్ట్స్ సీఎండీ కె.వి.రావు రూ.5 కోట్లు విరాళం ఇచ్చారు. అలాగే ఏఎంగ్రీన్-గ్రీన్‍కో సంస్థ రూ.5 కోట్లు ఇచ్చింది. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు కోటిన్నర ఇచ్చాయి. ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. సీఎం సహాయనిధికి మోహిత్ మినరల్స్ సంస్థ రూ.50 లక్షలు ఇచ్చింది.
Telangana Politics: తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా.. బీఆర్‌ఎస్ నేతల మాటల్లో నిజమెంత
కల్యాణ్ ఆక్వా అధినేత రాజేంద్రబాబు రూ.10 లక్షలు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా మహిళా సమాఖ్య సీఎం సహాయనిధికి రూ.10 లక్షలు ఇచ్చింది. కోటపాటి జనార్దన్ రావు రూ.10 లక్షలు ఇచ్చారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ10 లక్షల విరాళం ఇచ్చారు. భూమా-శోభానాగిరెడ్డి ట్రస్ట్ తరఫున విరాళం అందించడం జరిగింది. అలాగే విజయవాడలో వెయ్యి కుటుంబాలకు అఖిలప్రియ నిత్యావసరాలు పంపిణీ చేశారు. వరద బాధితుల సహాయార్థం మంత్రి లోకేష్‌కు సైతం పెద్ద ఎత్తున దాతలు విరాళాలు అందజేస్తున్నారు. భూపతిరాజు సీతాదేవి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు రూ.10 లక్షల విరాళం.. ఆంధ్రప్రదేశ్ నెఫ్రాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అమ్మన్న రూ.5లక్షల విరాళం అందజేశారు. విజయవాడ హైటెక్ ప్రింట్ సిస్టమ్స్ యజమాని ఎస్‌వీఎస్ శెట్టి రూ.1,71,272 విరాళం అందజేశారు. మండవ వెంకట సూర్యప్రతాప్, నాగశ్వేత దంపతులు రూ.50వేలు, కోనేరు అనిల్ కుమార్ రూ.50వేలు అందజేశారు.
ఇవి కూడా చదవండి
AP Flood: ఏలేరు వరద ఉధృతి.. 25 వేల ఎకరాలు నీట మునక
Janasena: జనసేన జెండాకు ఘోర అవమానం.. భగ్గుమన్న జనసైనికులు
Read Latest AP News And Telugu News
Updated Date - Sep 10 , 2024 | 12:17 PM