AP News: బెజవాడలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య.. కారణం ఇదే!
ABN, Publish Date - Apr 30 , 2024 | 01:29 PM
Andhrapradesh: బెజవాడలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. విజయవాడ గురునానక్ నగర్‌లో ఓ కుటుంబలోని ఐదుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయిన వారు ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంగా గుర్తించారు. భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నట్లు గుర్తించారు.
విజయవాడ, ఏప్రిల్ 30: బెజవాడలో ఓ కుటుంబం ఆత్మహత్యకు (Family Suicide) పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. విజయవాడ (Vijayawada) గురునానక్ నగర్‌లో ఓ కుటుంబలోని ఐదుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయిన వారు ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంగా గుర్తించారు. మృతుల్లో భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీస్ కమిషనర్ రామకృష్ణ ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో విచారణ చేస్తున్నారు.
TS SSC Results 2024: తెలంగాణ ఎస్‌ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల
ఆత్మహత్యపై ఎన్నో అనుమానాలు..
అయితే చనిపోయిన శ్రీనివాస్ గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. ఏడాది క్రితం శ్రీజ హాస్పిటల్‌ను ప్రారంభించారు. అయితే ఆస్పత్రి సరిగ్గా నడవడం లేదనే ఆందోళనతో శ్రీనివాస్ డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితమే ఆస్పత్రిని శ్రీనివాస్ వేరేవారికి అప్పగించారు. కాగా.. ఇంటి బయట చెట్టుకు ఉరి వేసుకుని శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోగా.. నలుగురు కుటుంబసభ్యుల గొంతు కోసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే శ్రీనివాస్ కుటుంబం ఆత్మహత్యపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నలుగురిని హత్య చేసి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక అందిరినీ ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసలు దర్యాప్తు చేపట్టారు. కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Alert: మే 1 నుంచి ఈ క్రెడిట్ కార్డులపై బాదుడే బాదుడు
మృతుల వివరాలు..
డాక్టర్ శ్రీనివాస్ (40)
ఉషారాణి (36)
శైలజ (9)
శ్రీహాన్ (5)
శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65)
శ్రీనివాస్ చాలా సౌమ్యుడు: స్నేహితులు
డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్యపై స్నేహితులు డాక్టర్ భగవాన్, డాక్టర్ మాధవి ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ‘‘శ్రీనివాస్ చాలా సౌమ్యుడు. సంవత్సరం క్రితం శ్రీజ హాస్పిటల్ పేరుతో సొంతంగా హాస్పటల్ ఏర్పాటు చేశాడు. కొంతకాలం హస్పటల్ సక్రమంగా నిర్వహించాడు. తరువాత హాస్పటల్ నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనాయి. హాస్పిటల్‌కు నెలకు రూ.20 నుంచి రూ.30 లక్షలు ఎదురు పెట్టుబడి పెడుతున్నాడు. రెండు నెలల క్రితం తన స్నేహితుల వద్ద నేను సూసైడ్ చేసుకుంటానంటూ చెప్పాడు. కొంతమంది మానసికంగా ధైర్యం కూడా చెప్పారు. కేవలం ఆర్థిక ఇబ్బందులు వల్లే శ్రీనివాస్ చనిపోయాడు. తల్లిని, భార్యను, ఇద్దరి పిల్లలను హత్య చేశాడంటే మేమే నమ్మలేకుండా ఉన్నాం. 25 సంవత్సరాల నుంచి శ్రీనివాస్‌తో మాకు మంచి అనుబంధం ఉంది. చదువుకునే సమయంలో కూడా ప్రతి ఒక్కరితో చాలా మర్యాదగా వ్యవహరించేవాడు. హాస్పిటల్ నడపలేక వేరే వాళ్లకి లీజ్‌కు ఇచ్చాడు’’ అని స్నేహితులు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
AP Elections: సొంత ఇలాకాలో సాక్షాత్తు సీఎం జగన్ సతీమణికి చేదు అనుభవం..
Chandrababu: మారీచుడు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొందాం.. వైసీపీ కుట్రలను సాగనివ్వం
Read Latest AP News And Telugu News
10th ఫలితాల కోసం క్లిక్ చేయండి...
Updated Date - Apr 30 , 2024 | 02:20 PM