ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jagan: సెక్యూరిటీ పునరుద్దరణపై హైకోర్టులో జగన్ పిటిషన్.. మధ్యాహ్నానికి వాయిదా

ABN, Publish Date - Aug 07 , 2024 | 12:56 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి హోదాలో తనకు కల్పించిన సెక్యూరిటీని పునరుద్ధరించాలంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా... కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ కోర్టును కోరారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ప్రయాణించడానికి అనుకూలంగా లేదని కోర్టుకు జగన్ తరపు సీనియర్ న్యాయవాది శ్రీరామ్ తెలిపారు.

Former CM YS Jaganmohan Reddy

అమరావతి, ఆగస్టు 7: ముఖ్యమంత్రి హోదాలో తనకు కల్పించిన సెక్యూరిటీని పునరుద్ధరించాలంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (Former CM YS Jaganmohan Reddy)హైకోర్ట్‌లో (AP High Court) పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా... కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ కోర్టును కోరారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ప్రయాణించడానికి అనుకూలంగా లేదని కోర్టుకు జగన్ తరపు సీనియర్ న్యాయవాది శ్రీరామ్ తెలిపారు. జామర్ వెహికల్ కూడా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. మంచి బీపీ వెహికల్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ బీపీ వెహికల్, జామర్ వెహికల్ ఇచ్చే విషయంలో అధికారులను అడిగి వివరాలు సమర్పిస్తామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేసింది.

Viral Video: జీపును బోటులా వాడడంపై అవాక్కైన ఆనంద్ మహీంద్రా.. వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా..



కాగా... జూన్ 3 నాటికి ఉన్న భద్రతను పునరుద్దరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని జగన్ పిటిషన్‌లో కోరారు. ఎన్నికల ఫలితాల తర్వాత నెలరోజుల్లోనే తన భద్రతను తగ్గించారని, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే భద్రతను తగ్గించారని వెల్లడించారు. జడ్ ప్లస్‌గా ఉన్న భద్రతను తగ్గించడంతో పాటు భద్రతా సిబ్బందిని కూడా తగ్గించేరన్నారు. గతంలో తనకు 139 మంది భద్రతా సిబ్బంది ఉండగా... ప్రస్తుతం ఆ సంఖ్యను 59కి తగ్గించారని... భద్రతను పునరుద్దరించాలని కోరారు. అయితే.. జగన్ ఆరోపణలను పోలీసు శాఖ, ప్రభుత్వం కొట్టిపారేశాయి. నిబంధనల మేరకు జగన్‌కు భద్రతను కేటాయించామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జడ్‌ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదనంగా ఉన్న భద్రతనే తొలగించామే తప్ప ఇంకే లేదని పోలీసు శాఖ వెల్లడించింది. ప్రస్తుతం జగన్‌కు సీఎం హోదా భద్రత కుదరదని అధికార వర్గాలు తేల్చి చెప్పేశాయి.

Olympics 2024: ఒలింపిక్స్ నుంచి వినేశ్ ఫోగట్ ఔట్


అయితే.. జగన్‌ అధికారంలో ఉన్నప్పుడుహై సెక్యూరిటీ ఉండేదనే విషయం అందరికీ తెలిసిందే. తాడేపల్లి నివాసం దగ్గర పెద్ద ఎత్తున సెక్యూరిటీతో పాటు.. జగన్‌ ఇంటికి వెళ్లే దారిలోనూ చెక్‌ పోస్టులు అధికంగా ఉండేవి. దాదాపు 300 మంది రక్షణలో జగన్‌ ఉండేవారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. దీంతో జగన్‌కు ఉండే సెక్యూరిటీని పెద్ద ఎత్తున తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


ఇవి కూడా చదవండి...

AP News: విజయవాడలో చేనేత కళాకారుల వాక్

Amaravati: అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 07 , 2024 | 01:01 PM

Advertising
Advertising
<