ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: అజ్ఞాతంలో మాజీ మంత్రి పేర్నినాని కుటుంబ సభ్యులు..

ABN, Publish Date - Dec 13 , 2024 | 11:33 AM

కృష్ణా జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సివిల్ సప్లయి గోదాంలో బియ్యం అవకతవకలపై ప్రధాన నిందితురాలిగా పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కృష్ణా జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader), మాజీ మంత్రి (Former Minister) పేర్ని నాని (Perni Nani) కుటుంబ సభ్యులు (Family) అజ్ఞాతం (Hiding)లోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ (Anticipatory Bail) కోసం మచిలీపట్నం జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు పేర్ని నాని భార్య జయసుధ (Jayasudha) బెయిల్ పిటిషన్ వేశారు. సివిల్ సప్లయి గోదాంలో బియ్యం అవకతవకలపై ఆమెపై కేసు నమోదు అయింది. ప్రధాన నిందితురాలిగా పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పేర్ని నాని వ్యక్తి గత సహాయకుడు మానస తేజ పేర్ని నానిపై కూడా కేసు నమోదు అయింది. గత మూడు రోజులుగా పేర్ని నాని అందుబాటులో లేరు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

కాగా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌ సమీపంలో ఉన్న పొట్లపాలెం గ్రామంలో వైసీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి పేర్ని నానీకి సుమారు 2 ఎకరాల్లో గోదాములు ఉన్నాయి. 2020లో ఆయన సతీమణి జయసుధ పేరుతో ఇక్కడ గోదాములను నిర్మించి పౌరసరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. పౌరసరఫరాల శాఖ వీటిని బఫర్‌ గోదాములుగా వినియోగిస్తోంది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు.. అంటే మార్చి, ఏప్రిల్‌లో 187 టన్నుల పీడీఎస్‌ బియ్యం ఇక్కడి నుంచి మాయమైంది. ప్రతినెలా నిర్వహించే తనిఖీల్లో ఈ విషయాన్ని గుర్తించినా అప్పట్లో అధికారులు గుట్టుగా ఉంచారు. తాజాగా గుట్టురట్టు కావడంతో పేర్ని జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. బందరు తాలుకా పీఎస్‌లో బీఎన్‌ఎస్‌ 316(3), 316(5), 61(2) రెడ్‌విత 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


బయటపడిందిలా..

పేర్ని నాని నిర్మించిన గోదాములు పౌరసరఫరాల శాఖ ప్రమాణాల మేరకు లేవు. గోదాముల చుట్టూ లారీలు తిరిగేందుకు రోడ్డును నిర్మించాల్సి ఉంటుంది. బియ్యం పాడవ్వకుండా, గోదాముల్లోకి తేమ చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవేమీ లేకుండానే గోదాములు నిర్మించేయడం, వాటిని పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చేయడం జరిగిపోయింది. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో పేర్ని నాని మాటకు తిరుగు లేకుండాపోయింది. ఎన్నికల అనంతరం పేర్ని నాని గోదాములపై స్థానిక టీడీపీ నాయకులు పౌరసరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిర్దేశిత ప్రమాణాల మేరకు లేకున్నా వాటిని ఎలా నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన పౌరసరఫరాల శాఖ అధికారులు గోదాములను పరిశీలించి, నిర్దేశిత ప్రమాణాల మేరకు లేవని, వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. గోదాములను నవంబరు నెలాఖరులో ఖాళీచేసే సమయంలో రికార్డుల ప్రకారం బియ్యం లేకపోవడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. నవంబరు 28, 29 తేదీల్లో గోదాములను తనిఖీ చేసిన అధికారులు 187 టన్నుల బియ్యం తగ్గినట్టు గుర్తించారు.

తనిఖీల విషయం తెలిసే..

పీడీఎస్‌ బియ్యం తగ్గిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడానికి ముందే పేర్ని నానీకి చేరిపోయింది. బయట కొనుగోలు చేసిన బియ్యాన్ని గోదాములకు చేర్చి గుట్టుచప్పుడు కాకుండా బయటపడటానికి తగిన సమయం లేకపోవడం.. అంత భారీస్థాయిలో బియ్యాన్ని అప్పటికప్పుడు సమకూర్చడం కష్టమని తేలిపోవడంతో పేర్ని నాని లేఖ డ్రామాకు తెరలేపారు. ‘గోదాముల్లో బియ్యం తగ్గిన విష అయితే ఆ మొత్తాన్ని చెల్లిస్తాను’ అని కృష్ణాజిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మకు పేర్ని నాని తన సతీమణి ద్వారా లేఖ రాయించారు. ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చేందుకు సరిగ్గా ఒకరోజు ముందు ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. పౌరసరఫరాల శాఖలో కొందరు అధికారులే పేర్ని నానీకి ముందుగా సమాచారం చేరవేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వేబ్రిడ్జిలో లోపాలు ఉంటే రికార్డుల్లోనూ, క్షేత్రస్థాయిలోనూ ఒకేలా నమోదు కావాలి. అలాకాకుండా రికార్డుల్లో ఓ రకంగా, క్షేత్రస్థాయిలో మరో రకంగా ఎందుకు ఉంటుందని, తప్పును కప్పిపుచ్చుకునేందుకే పేర్ని నాని బుకాయిస్తున్నారని స్పష్టమవుతోంది.


రేషన్‌ మాఫియాలో భాగమేనా..

పేదలకు దక్కాల్సిన పీడీఎస్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించిన ఉదంతంలో బియ్యం ఎక్కడికి చేరిందన్న దానిపై అధికారులు దృష్టి సారించాలని టీడీపీ నాయకులు కోరుతున్నారు. పేర్ని నాని సైతం రేషన్‌ మాఫియాతో చేతులు కలిపి పేదల బియ్యాన్ని తన గోదాముల నుంచి నేరుగా కాకినాడ పోర్టుకు తరలించేవారని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో బియ్యం పక్కదారి పట్టిన విషయం వెలుగు చూసిందని, వైసీపీ హయాంలోనూ వందల టన్నుల బియ్యం ఈ గోదాము నుంచి నేరుగా కాకినాడ పోర్టుకు తరలిపోయాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. యం మా దృష్టికి వచ్చింది. వేబ్రిడ్జిలో లోపం కారణంగా బియ్యం తగ్గి ఉండొచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజా సమ్యస్యల మీద పోరాడే ఫార్ములే కేటీఆర్..

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..

మహిళా హోంగార్డుపై హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య..

హైదరాబాద్ బేగంబజార్‌లో దారుణం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 13 , 2024 | 11:43 AM