Skill Development Case: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు విచారణ
ABN, Publish Date - Mar 19 , 2024 | 07:51 AM
న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తోందని, వెంటనే బెయిల్ రద్దు చేయాలని గత వాదనల సందర్బంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు.
న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case) చంద్రబాబు (Chandrababu) బెయిల్ రద్దు పిటిషన్ (Bail Cancellation Petition)పై మంగళవారం సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరగనుంది. జస్టిస్ బేలా త్రివేది (Justice Bela Trivedi), జస్టిస్ పంకజ్ మిట్టల్ (Justice Pankaj Mittal) ధర్మాసనం విచారణ చేపట్టనుంది. చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తోందని, వెంటనే బెయిల్ రద్దు చేయాలని గత వాదనల సందర్బంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. దానికి సంబంధించిన వివరాలతో ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసినట్లు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనంకు న్యాయవాదులు తెలిపారు. ప్రభుత్వం దాఖలు చేసిన ఐఎపై సమాధానం ఇవ్వాలనుకుంటున్నట్లు చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపడంతో తదుపరి విచారణ మూడు వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది.
చంద్రబాబు కుటుంబం ఒక డైరీ పెట్టి... అందులో అధికారుల పేర్లు నమోదు చేస్తున్నట్లు చెపుతోందని, తాము అధికారంలోకి వస్తే... అందరిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తోందని ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటని ప్రభుత్వ న్యాయవాదులను జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నట్లు ముకుల్‌రోహత్గి చెప్పారు. స్కిల్ కేసులో బెయిల్ మంజూరు తర్వాత... చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయని, నిందితుడి కుటుంబ సభ్యులు అధికారులను, దర్యాప్తు సంస్థను బెదిరిస్తున్నారన్న ముకుల్ రోహత్గి అన్నారు. వెంటనే బెయిల్ రద్దు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని, తక్షణం విచారణ చేపట్టాలని ముకుల్ రోహత్గి కోరారు.
కాగా ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశానికి తాము సమాధానం ఇస్తామని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ.. తదుపరి విచారణ మూడు వారాల తరువాత చేపట్టనున్నట్లు ప్రకటించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు విచారణ జరుపనుంది. చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోలేదని సీఐడీ ప్రధానంగా పిటిషన్‌లో పేర్కొంది.
Updated Date - Mar 19 , 2024 | 07:51 AM