Vijayawada: ఓవైపు ఆషాడ మాసం.. మరోవైపు భారీ వర్షం... వెరసి భారీగా ట్రాఫిక్ జామ్
ABN, Publish Date - Jul 13 , 2024 | 12:41 PM
Andhrapradesh: నగరంలోని భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరంలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో రోడ్లపై వర్షపు నీరు ఎక్కడిక్కడ నిలిచిపోయింది. దీంతో రోడ్లపై చేరిన వర్షపు నీటిని అధికారులు తొలగిస్తున్నారు. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
విజయవాడ, జూలై 13: నగరంలోని భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరంలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Heavy Rains) కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో రోడ్లపై వర్షపు నీరు ఎక్కడిక్కడ నిలిచిపోయింది. దీంతో రోడ్లపై చేరిన వర్షపు నీటిని అధికారులు తొలగిస్తున్నారు. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
Congress: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్ గూటికి గాంధీ
మరోవైపు ఆషాడ మాసం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవారికి సారే సమర్పించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి పడతాయనే నేపథ్యంలో ఘాట్ రోడ్‌ను అధికారులు నిలిపివేశారు. కనకదుర్గనగర్ నుంచి భక్తులు సారెను తీసుకెళ్తున్నారు. శుక్ర, శని, ఆదివారాలు వీకెండ్స్ కావడంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తుల తాకిడితో రోడ్లపైన వాహనలు నిలిచిపోతున్నాయి. ఇంద్రకీలాద్రికి సరైనటువంటి పార్కింగ్సౌ కర్యం లేకపోవడంతో భక్తులు రోడ్లపైనే వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఇవి కూడా చదవండి..
Budda Venkanna: నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అయితే... తాచుపాము జగన్
Hyderabad: కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్‌పై కొరడా..
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 13 , 2024 | 01:05 PM